Newsమెగాస్టార్ బ్లాక్‌బ‌స్ట‌ర్ టైటిల్‌తో వ‌స్తోన్న విజ‌య్ ఆంటోనీ...ఆ టైటిల్ ఇదే..!

మెగాస్టార్ బ్లాక్‌బ‌స్ట‌ర్ టైటిల్‌తో వ‌స్తోన్న విజ‌య్ ఆంటోనీ…ఆ టైటిల్ ఇదే..!

పలు వైవిధ్యమైన సినిమాలలో సౌత్ఆడియన్స్‌ణు ఆకట్టుకుంటున్నాడు హీరో విజయ్ ఆంటోనీ. అతి బాధాకరమైన విషయం ఏంటంటే తాజాగా విజ‌య్ ఆంటోనీ కుమార్తె మీరా ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ బాధ నుంచి వెంటనే కోలుకున్న విజయ్ ఆంటోనీ తన తాజా సినిమా షూటింగ్లో కంటిన్యూ అవుతున్నాడు. విజయ్ అంటోని తన కొత్త సినిమా హిట్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

గతంలో ఇదే హీరోతో విజయ్ రాఘవన్ అనే సినిమా నిర్మించిన చందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ హిట్లర్ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాను యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ధన రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ట్రైన్ జర్నీలో ఉన్న హీరో విజయ్ ఒక క్రైమ్ ఇన్సిడెంట్ కేసు ఎదుర్కొన్నట్టు మోష‌న్‌ పోస్టర్లో చూపించారు.

ట్రైన్లో హీరోయిన్ రియా సుమన్‌ను హీరో కలుసుకుంటారు. అలాగే గ‌న్ పేలుస్తున్న గౌతమ్ మీన‌న్‌ కీలకపాత్రలో కనిపించారు. ప్రజాస్వామ్యం పేరుతో కొందరు పాలకులు నియంతలా వ్యవహరిస్తున్నారు.. అలాంటి నియంతను ఎదుర్కొనే ఓ సాధారణ పౌరుడి కథ హిట్లర్. హిట్లర్ ఒక పేరు కావచ్చు కానీ ఇప్పుడున్న ప్రజాస్వామ్య పరిస్థితిలో ఆ పేరు నియంతలకు మారుపేరుగా మారింది.. అందుకే ఈ సినిమాకు ఈ టైటిల్ పెట్టినట్టు మేకర్స్ తెలిపారు

విచిత్రం ఏంటంటే తెలుగులో ఎప్పుడో రెండున్నర దశాబ్దాల క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరోగా హిట్లర్ సినిమా వచ్చింది. ఈ సినిమాలో రంభ హీరోయిన్‌. ముత్యాల సుబ్బ‌య్య ద‌ర్శ‌కుడు. ఇప్పుడు అదే బ్లాక్ బస్టర్ హిట్స్ ని మా టైటిల్ తో విజయ్ అంటోనీ మళ్ళీ తెలుగు ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు. మరి ఆ టైటిల్ సెంటిమెంట్ రిపీట్ చేస్తూ హిట్లర్ తో విజయ్ హిట్ కొడతాడని ఆశిద్దాం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news