Newsసూర్య - జ్యోతిక వేరు కాపురం... క‌న్నీళ్లు పెట్టిస్తోన్న‌ హీరో కార్తీ...

సూర్య – జ్యోతిక వేరు కాపురం… క‌న్నీళ్లు పెట్టిస్తోన్న‌ హీరో కార్తీ మాట‌లు..!

కోలీవుడ్ లో అందమైన కపుల్స్ అంటే ముందుగా అందరికీ గుర్తు వచ్చే పేరు హీరో సూర్య – హీరోయిన్ జ్యోతిక‌. వారిద్దరి అభిమానులు కూడా వారిని అన్నా వదిన అని ముద్దుగా పిలుస్తూ ఉంటారు. ఇక కోలీవుడ్ మీడియాలో కొద్ది రోజుల నుంచి సూర్య – జ్యోతిక వేరు కాపురం పెట్టారు.. ప్రస్తుతం జ్యోతిక పిల్లలతో ముంబైలో ఉంటుంది ..సూర్య మాత్రం ముంబై టు చెన్నై తిరుగుతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. 2006లో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు.

అప్పుడు జ్యోతిక కెరీర్ కూడా పీక్లో ఉంది. ఎన్నో యేళ్లుగా కలిసి ఉన్న వీరి కుటుంబంలో జ్యోతిక వ‌ల్ల‌నే విభేదాలు వచ్చినట్టు తమిళ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ముందు నుంచి వీరి ప్రేమ పెళ్లి పై ఒక టాక్ అయితే ఉంది. సూర్య.. జ్యోతికను వివాహం చేసుకోవడం సూర్య తండ్రి శివకుమార్‌కు ఇష్టం లేదని.. కొడుకు ప్రేమను కాదనలేక పెళ్లి చేశాడని అప్పట్లో చెప్పుకున్నారు. ఇక జ్యోతిక ఇప్పుడు తిరిగి సినిమాలు చేయటం మామ శివకుమార్ కు ఏ మాత్రం ఇష్టం లేదని.. అందువల్ల కుటుంబంలో గొడవలు జరిగాయి అన్న ప్రచారం కూడా బయటకు వచ్చింది.

ఈ గొడవల్లో సూర్య కూడా తన భార్య జ్యోతికకే మద్దతు ఇవ్వటంతో.. అది తండ్రికి నచ్చలేదని చెప్పుకుంటున్నారు. ఈ గొడవలు పెరిగి పెద్దవి కావడంతో సూర్య – జ్యోతిక ఇద్దరు చెన్నై నుంచి ముంబైకు మఖం మార్చేశారని కూడా ప్రచారం జరిగింది. దీనిపై సూర్య మరిది హీరో కార్తీ స్పందించాడు. నేను జ్యోతికను ఒక నాటిక ఎప్పుడు చూడలేదు.. ఆమెను మా అమ్మగానే చూశాను.. ఆమె కూడా మమ్మల్ని తన పిల్లలు మాదిరిగానే చూసింది.. ఆమె ఇప్పుడు ముంబైలో ఉండడంతో ఇల్లు అంతా బోసిపోయినట్లు ఉంద‌ని చెప్పాడు

ఆమె లేని ఇంట్లో ఉండటం మా వల్ల కావడం లేదు.. జ్యోతిక‌తో కలిసి ఉన్నప్పుడు మా కుటుంబం ఎంతో సంతోషంగా ఉంది.. ఇన్నేళ్ల పాటు తమ అందరం కలిసి సంతోషంగా ఉన్నాం అంటే దానికి ప్రధాన కారణం జ్యోతికనే..! అయితే అన్నయ్య పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు.. వారు చదువుల కోసం మాత్రమే వారు ముంబై వెళ్లారు.. చదువులు పూర్తి అయిన తర్వాత అందరం తప్పకుండా కలిసే ఉంటాం అని కార్తీ చెప్పాడు. ఏదేమైనా కార్తీ చెప్పిన మాట‌ల‌తో వీరి కుటుంబం ఎంత అంద‌మైందో… అయితే వీరు దూరంగా ఉండ‌డం ఎవ్వ‌రికి ఇష్టం లేద‌ని కార్తీ ఎమోష‌న‌ల్‌గా చెప్పిన‌ట్టు తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news