Moviesవావ్: సినీ ఇండస్ట్రీలో కి మరో ఐశ్వర్య రాయ్.. ఈ బ్యూటీకి...

వావ్: సినీ ఇండస్ట్రీలో కి మరో ఐశ్వర్య రాయ్.. ఈ బ్యూటీకి అది కూడా ఎక్కువే..!!

బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ ఐశ్వర్యరాయ్ కు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరి ముఖ్యంగా తన అందచందాలతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసేసింది . కొన్నాళ్లపాటు మకుటం లేని మహారాణిగా ఇండస్ట్రీని ఏలేసిన ఈమె ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి అదే రేంజ్ లో ముందుకెళ్తుంది. అయితే జనరల్ గా ఎవరైనా అందమైన అమ్మాయిని చూస్తే ఖచ్చితంగా ఐశ్వర్యరాయ్ తోనే కంపేర్ చేస్తూ ఉంటారు.

అయితే ఇండస్ట్రీలోకి మరో ఐశ్వర్య రాయి వచ్చేసింది అంటూ ప్రచారం జరుగుతుంది . ఆమె మరి ఎవరో కాదు రష్మిక మందన్నా. రీసెంట్గా రష్మిక మందన్నా అనిమల్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు సందీప్ రెడ్డి వంగా . రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్నా నటిస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే రన్బీర్ కపూర్ ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అవ్వగా చాలా చాలా అభిమానులను ఆకట్టుకుంది .

ఈ క్రమంలోనే రష్మిక మందన్నా పోస్టర్ సైతం అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది . అయితే ఈ ఫోటోలో రష్మిక రెడ్ శారీలో మెడలో నల్లపూసల దండ చిన్న చైన్ వేసుకొని నుదుట బొట్టు పెట్టుకొని చాలా చాలా అట్రాక్టివ్ గా ట్రెడిషనల్ గా కనిపించింది . దీంతో సోషల్ మీడియాలో అందరూ ఐశ్వర్యలా ఉంది అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . అంతేకాదు ఇండస్ట్రీకి దొరికిన మరో ఐశ్వర్య రాయ్ అంటూ ఓ రేంజ్ లో ఆమెను ఫొటోస్ ని ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news