Newsశ్రీలీల చేసిన గొప్ప ప‌నికి ఆమె క్రేజ్ ఒక్క‌సారిగా మారిపోయింది... హాట్యాఫ్...

శ్రీలీల చేసిన గొప్ప ప‌నికి ఆమె క్రేజ్ ఒక్క‌సారిగా మారిపోయింది… హాట్యాఫ్ పిల్లా…!

శ్రీలీల టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లి సందD, ధమాకా వంటి రెండే సినిమాలు చేసింది కానీ ఆ తర్వాత మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ ముద్దుగుమ్మ చేతిలో ప్రస్తుతం ఇప్పుడు చాలానే టాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. ఏ ఇతర స్టార్ హీరోయిన్ కి రానన్ని సినిమా అవకాశాలు ఒకేసారి ఆమె వద్దకు రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతానికి ఈ ముద్దుగుమ్మ స్కంద, ఆదికేశవ, భగవంత్‌ కేసరి, గుంటూరు కారం, ఉస్తాద్‌ భగత్ సింగ్ వంటి సినిమాల్లో యాక్ట్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.

దీనికి తోడు స్టడీస్ కూడా చేస్తోంది. అంతేకాదు సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ అందరి నుంచి ప్రశంసలు అందుకుంటుంది. రీసెంట్‌గా ఈ అందాల తార చీర్స్ అనే ఒక ఆర్ఫాన్ ఫౌండేషన్‌కు వెళ్లి రాఖీ పండుగ జరుపుకుంది. ఆ అనాథశ్రమంలో ఉన్న పిల్లలకు బహుమతులు కూడా అందజేసి వారిని సంతోష పెట్టింది. వారి తోటి రాఖీ కట్టించుకుంది. స్వీట్స్ తినిపించి వారి పెదాలపై చిరునవ్వును తెచ్చింది.

అంతేకాకుండా ఆ అనాథ పిల్లలకు ఏం కావాలన్నా తాను సమకూర్చగలనని చెప్పి తన మంచి మనసును చాటుకుంది. శ్రీలీలకు ఇప్పుడు కేవలం 22 ఏళ్లే. ఇంత చిన్న వయసులోనే ఈ ముద్దుగుమ్మ సూపర్ సక్సెస్ సాధించింది. దానివల్ల వచ్చిన సంతోషాన్ని తాను ఒక్కటే ఆస్వాదించకుండా ఇతరులతో కూడా ఈ బ్యూటీ పంచుకుంటోంది. ముఖ్యంగా తల్లిదండ్రుల ప్రేమ పొందలేని అనాథల కోసం ఆమె ఎంతో చేస్తోంది. చీర్స్ ఫౌండేషన్‌కి వెళ్లి గడిపిన మధురమైన క్షణాలను ఫోటోల రూపంలో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా శ్రీ లీల షేర్ చేసింది. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అవి చూసి చాలా మంది అభిమానులు ఆమె గొప్ప మనసుకు ఫిదా అవుతున్నారు. అందం, అభినయం, నటన, డ్యాన్స్‌తో మాత్రమే కాదు మీ మంచి మనసుతో కూడా మా హృదయాలను గెలిచేసారు మేడం అని చాలామంది ఎమోషనల్ గా కామెంట్స్‌ చేస్తున్నారు. మరి కొందరు ఆమె అనాథ పిల్లలతో గడిపిన ఫోటోలను బాగా ట్రెండ్ చేస్తున్నారు. శ్రీలీల వంటి అమ్మాయిలు ఉండటం చాలా అరుదు అని, ఆమె ఒక దేవత అని కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి మంచి మనసున్న అమ్మాయికి ఇంకా మరింత సక్సెస్ రావాలని కోరుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news