Moviesవన్స్ మోర్ ప్లీజ్..అభిమానుల కోసం మరోసారి అలా చేయబోతున్న స్టార్ లవ్...

వన్స్ మోర్ ప్లీజ్..అభిమానుల కోసం మరోసారి అలా చేయబోతున్న స్టార్ లవ్ బర్డ్స్..గెట్ రెడీ రా ఫ్యాన్స్..!

సోషల్ మీడియాలో హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మిక మందన్నాల పేర్లు ఎప్పుడూ మారుమ్రోగిపోతూ ఉంటాయి. ఎప్పుడు కూడా టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతూ ఉంటాయి . దానికి కారణం వాళ్ళ హిట్ సినిమాలు . వీళ్ళ కాంబోలో వచ్చిన సినిమా గీతాగోవిందం ఏ రేంజ్ లో హిట్ అయిందో మనకు బాగా తెలుసు . మరీ ముఖ్యంగా విజయ్ దేవరకొండకు రష్మిక మందనకు సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసింది ఈ మూవీ అని చెప్పాలి .

అఫ్కోర్స్ .. ఆ తర్వాత వీళ్ళ కాంబోలో వచ్చిన సినిమాలు ఫ్లాప్ అయినా సరే ..వీళ్ళ మధ్య బయట వర్క్ అవుట్ అయిన కెమిస్ట్రీ జనాలకు బాగా నచ్చేసింది . కొంతమంది వీళ్ళు ప్రేమించుకుంటున్నారు అంటూ డిసైడ్ అయ్యారు. మరి కొంతమంది త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా ప్రచారం చేశారు . రీసెంట్ గా సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ రష్మిక మందన్నా మరోసారి కలవబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది.

ఫ్యామిలీ స్టార్ సినిమాతో భారీ డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న విజయ్ దేవరకొండ తాజాగా రాజావారు రాణి గారు ఫేమ్ రవికిరణ్ దర్శకత్వంలో ఒక మూవీ కి కమిట్ అయ్యాడు. దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు . ఈ సినిమా ఆయన కెరియర్ లో 16వ సినిమాగా తెరకెక్కుతుంది . అయితే ఈ సినిమా కంటే ముందే టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సాంక్త్యతో ఒక సినిమా చేస్తున్నారు విజయ్. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుంది అంటూ బలంగా వినిపిస్తుంది . దీంతో రష్మిక మందన్నా విజయ్ దేవరకొండ మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు అన్న ప్రచారం బాగా ఊపందుకుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news