Moviesసోషల్ మీడియాలో మారుమ్రోగిపోతున్న సూర్య-జ్యోతికల కుమార్తె పేరు..కారణం ఏంటో తెలుసా..?

సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతున్న సూర్య-జ్యోతికల కుమార్తె పేరు..కారణం ఏంటో తెలుసా..?

సూర్య .. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోయిన్ జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . ఇద్దరూ కూడా ఇండస్ట్రీలో తమదైన స్టైల్ లో దున్నేస్తున్నారు. కాగా సెకండ్ ఇన్నింగ్స్ లోను జ్యోతిక అదిరిపోయే ఆఫర్స్ అందుకుంటుంది . మరీ ముఖ్యంగా బాడీ ఫిట్నెస్ విషయంలో జ్యోతిక అందరికీ ఇన్స్పిరేషన్ గా నిలిచింది. ఒకపక్క ఫ్యామిలీని లీడ్ చేస్తూనే మరొకపక్క తన డ్రీమ్ ని ఫుల్ ఫిల్ చేసుకుంటుంది జ్యోతిక .

సూర్య కూడా ఎటువంటి పాత్రలు వస్తే అటువంటి పాత్రలు చేయకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను చూస్ చేసుకుంటున్నారు. ఇద్దరికీ ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. తాజాగా సూర్య జ్యోతికల కుమార్తె పేరు కోలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు సోషల్ మీడియాలోను ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . దానికి కారణం ఆమె సాధించిన ఘనత . సూర్య జ్యోతికల కుమార్తె దియా.. బిలినియర్ పిల్లలు చదువుకునే ధీరుభాయ్ అంబానీ స్కూల్లో చదువుతుంది .

ఈ ఏడాది ఆమె 12వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసింది . కాగా తల్లితండ్రులు గర్వపడేలా ఆమె స్కోరు రావడం ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది . 600 మార్కులు 581 మార్కులు సాధించి టాప్ రికార్డ్ క్రియేట్ చేసింది . లాంగ్వేజ్ లో 96 ఇంగ్లీషులో 97 అకౌంట్స్ లో 94 ఫిజిక్స్లో 99 కెమిస్ట్రీలో 98 కంప్యూటర్ సైన్స్ లో 97 మార్కులు సాధించి మొత్తంగా 600 మార్కులకు గాను 581 మార్కులు సాధించింది . దీంతో అభిమానులు సూర్య కుమార్తెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ స్టార్ జంట ఈ మూమెంట్ ని బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో సూర్య జ్యోతికల కుమార్తె దియా పేరు మారుమ్రోగిపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news