Moviesమృణాల్ ఠాకూర్ వేసుకున్న ఈ లెహంగా ఎంత స్పెషలో తెలుసా..వెరీ వెరీ...

మృణాల్ ఠాకూర్ వేసుకున్న ఈ లెహంగా ఎంత స్పెషలో తెలుసా..వెరీ వెరీ రేర్ పీస్..!

మృణాల్ ఠాకూర్ ..సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో దూసుకుపోతున్న పేరు . రీసెంట్ గానే ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో నటించింది . ఆ సినిమా ఫ్లాప్ అయింది . అయినా సరే తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది . పలు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా ఫోటో షూట్స్ చేస్తుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఇలాంటి ఫ్యాషన్ షోలు ర్యాంప్ వాక్ లు ఎక్కువగా చేసేది మృణాల్ ఠాకూర్.

రీసెంట్గా ఓ షోకి ఆమె ధరించిన డ్రెస్ హైలెట్ గా మారింది . జనరల్గా మృణాల్ ఠాగూర్ చాలా చాలా డిఫరెంట్ స్టైల్ ను ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ చాలా ట్రెడిషనల్ పద్ధతిలో ఉన్న లెహంగానే కొత్తరకంగా చూపించింది. బాంబే టైమ్స్ ఫ్యాషన్ వీక్ కోసం అదిరిపోయే లెహంగాతో మృణాల్ ర్యాంప్ వాక్ చేసింది . ఈ డ్రెస్ వల్ల మృణాల్ కు అందం వచ్చిందా ..? మృణాల్ వల్ల లెహంగా కు అందం వచ్చిందా..? తెలియకుండా ఉండే అంత అందంగా ఉంది .

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ డిజైనర్‌ అను పెల్లకూరు డిజైన్‌ చేసిన లెహెంగా అది. ‘స్వర్ణి రాహా’ పేరుతో కొత్త కలెక్షన్‌లో భాగంగా ఆ లెహంగాను మృణాల్‌ ఠాకూర్‌తో ప్రదర్శించారు. పింక్‌ కలర్‌ లెహెంగాపై ఎంబ్రాయిడరీతో, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు మేళవించేలా రూపొందించారు. బటర్‌ఫ్లై హెమింగ్‌ బ్లౌజ్‌ మరో హైలైట్‌. 1400 గంటల సమయం కేటాయించి మరి ఈ లెహంగాను డిజైన్ చేశారట . సోషల్ మీడియాలో ఈ లెహంగా కి సంబంధించిన డీటెయిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ఈ లెహంగా అమ్మాయిల మనసు దోచేస్తుంది . అంతేకాదు ఈ లెహంగాపై రీసెర్చ్ చేయడం కూడా స్టార్ట్ చేశారు . ఈ లెహంగాలో మృణాల్ అదిరిపోయే రేంజ్ లో ఉంది అంటూ కుర్రాళ్ళు నాటి కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news