Newsఒకటి కాదు రెండు కాదు 6 వ‌రుస హిట్లు కొట్టిన ప‌వ‌న్......

ఒకటి కాదు రెండు కాదు 6 వ‌రుస హిట్లు కొట్టిన ప‌వ‌న్… ఆ సెన్షేష‌న‌ల్ రికార్డుల లెక్క ఇదే..!

సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మూడేళ్లలోనే స్టార్ హీరోగా అవతరించాడు పవన్ కళ్యాణ్. మెగాస్టార్ చిరంజీవి అండతో మూవీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన పవన్ ఈ స్థాయికి రావడానికి అతని కృషి, పట్టుదల, యూనిక్ మేనరిజం, అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్ కారణమని చెప్పవచ్చు. టాలీవుడ్‌లో ఏ హీరోకి లేని ఫ్యాన్ ఫాలో అయిన పవన్ సొంతం. కెరీర్ తొలినాళ్లలోనే పవన్ చాలా విభిన్నమైన సినిమాలు చేశాడు.

1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో పవన్ మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత పవన్ చేసిన ఆరు సినిమాలు బ్యాక్-టు-బ్యాక్ హిట్స్ అయ్యాయి. ఆ ఆరు సినిమాలే అతడిని టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా మార్చాయి. ఎంతోమందిని పవన్‌కు వీరాభిమానులుగా మార్చాయి. ఆ సినిమాలతో పవన్ డబుల్ హ్యాట్రిక్ కొట్టి ఎవరికీ సాధ్యం కాని అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకీ ఏంటా సినిమాలు? ఇప్పుడు తెలుసుకుందాం.

పవన్ కళ్యాణ్ తన ఫస్ట్ సినిమా తర్వాత ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో ‘గోకులంలో సీత’ మూవీ చేశాడు. 1997లో రిలీజ్ అయిన ఈ సినిమాలో హీరోయిన్ రాశి పవన్‌తో జత కట్టింది. మంచి స్టోరీతో వచ్చిన ఈ మూవీ హిట్ అయింది. పవన్ ఈ సినిమాతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

1998లో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో పవన్ హీరోగా వచ్చిన ‘సుస్వాగతం’ సినిమా కూడా హిట్ అయింది. ఇందులో పవన్ సరసన దేవయాని నటించింది. ఈ సినిమాలోని ఆలయాన హారతిలో, ఏ స్వప్న లోకాల పాటలు సూపర్ హిట్ అయ్యాయి.

1998లోనే విడుదలైన ‘తొలిప్రేమ’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి హీరో హీరోయిన్లుగా నటించారు. కరుణాకరన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాతో పవన్ స్టార్‌డమ్‌ వేరే రేంజ్‌కి వెళ్ళిపోయింది. ఈ సినిమాలోని ‘ఈ మనసే సే’ పాట ఇప్పటికీ టాలీవుడ్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుందంటే అతిశయోక్తి కాదు. తొలిప్రేమ మూవీ 21 కేంద్రాలలో 100 రోజులు, 2 సెంటర్లలో 200 రోజులకు పైగా నడిచి అప్పట్లో కనక వర్షం కురిపించింది. ఇది ఆరు నంది అవార్డులు, ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ (తెలుగు) జాతీయ అవార్డు గెలిచింది.

బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన తమ్ముడు (1999) సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 2000లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, అమీషా పటేల్ హీరో హీరోయిన్లుగా వచ్చిన బద్రి సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత భూమిక చావ్లా, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో రిలీజ్ అయిన ఖుషి (2001) మూవీ ఆల్ టైమ్‌ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షోగా చెప్పుకునే ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో ప్రతి సీన్ ఒక మాస్టర్ పీస్ అని చెప్పవచ్చు. 2023లో రీ-రిలీజ్ అయిన ఈ మూవీ ఏకంగా రూ.6 కోట్లు వసూలు చేసింది అంటే దీనికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అలా పవన్ కళ్యాణ్ డబుల్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టి తన సత్తా చాటాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news