Newsఅమెరికాలో స‌మంత‌ను బండ‌ బూతులు తిట్టాడా... అసలేం జ‌రిగింది..!

అమెరికాలో స‌మంత‌ను బండ‌ బూతులు తిట్టాడా… అసలేం జ‌రిగింది..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా విజయ్ దేవరకొండకు జోడిగా నటించిన ఖుషి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో సమంత ఖుషి ఖుషిగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్లు ఇండియాలో పూర్తి చేసిన తర్వాత సమంత అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఆమె మయోసైటిస్ వ్యాధికి చికిత్స కోసం అమెరికా వెళ్లారు.

పనిలో పనిగా ఆమెను ఖుషి టీం ప్రమోషన్ చేయాలని కోరారు. దీంతో అమెరికాలో ఉన్న భారతీయులతో ఆమె ఈవెంట్లలో పాల్గొన్నారు. ఇందుకు గాను ఆమెకు అక్ష‌రాలా 25 వేల డాల‌ర్లు చెల్లించారు. అయితే ఆమె ఒప్పందం మేర‌కు రెండు గంట‌ల పాటు ఈ ఈవెంట్లో పాల్గోవాల‌ట‌. ఆమె గంట‌న్న‌ర కూడా పూర్త‌వ్వ‌కుండానే అక్క‌డ నుంచి కారులో వెళ్లిపోయింద‌ట‌.

వెంట‌నే స‌మంత వెన‌కాల వెళ్లాల్సిన ఆమె లగేజ్ కారును ఈవెంట్ ఆర్గ‌నైజ‌ర్లు చాలా సేపు ఆపి మ‌రీ పంపార‌ట‌. సమంత వెళుతున్న కారు డ్రైవర్ కి ఫోన్ చేసి ఈవెంట్ మేనేజర్ ఆమెను ఓ బూతు పదముతో తిట్టాడట. ఆ సమయంలో కారులో బ్లూటూత్ ఆన్ లో ఉండడంతో ఆ బూతు మాట సమంత చెవిన‌ కూడా పడడంతో ఆమె చాలా బాధపడినట్లు అమెరికాలో మ్యాటర్ అయితే లీక్ అయింది.

అయితే సమంత దీనిపై ఎవరికి ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. డబ్బులు తీసుకొని చెప్పిన సమయం వరకు ఉండలేదని ఆ ఈవెంట్ మేనేజర్ సమంతను తిట్టినట్టు సమాచారం. అయితే సమంత రెండు గంటల పాటు అక్కడ ఉండేలా చూసుకోవలసిన బాధ్యత అతడిపై ఉంది.. అలా అని బూతులు తిట్టడం కరెక్ట్ కాదు కదా అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. సమంత ఎంత బాధపడినా ఈ విషయాన్ని పెద్ధది చేయాలని అనుకోకపోవటం విశేషం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news