Newsస‌లార్ సినిమా వాయిదా వెన‌క ఇంత పెద్ద క‌థ న‌డుస్తోందా... ప్ర‌భాస్...

స‌లార్ సినిమా వాయిదా వెన‌క ఇంత పెద్ద క‌థ న‌డుస్తోందా… ప్ర‌భాస్ పెద్ద ప్రాబ్ల‌మ్‌లో ప‌డ్డాడే..!

కేజిఎఫ్ సీరియస్ సృష్టికర్త.. ఇండియన్ సినిమా క్రేజీ డైరెక్టర్లలో ఒకరు ఆయన ప్రశాంత నీల్.. బాహుబలి ప్రభాస్తో కలిసి తెర‌కెక్కిస్తున్న సినిమా సలార్. దాదాపు మూడు సంవత్సరాలుగా ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. స‌లార్‌రె సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న ఇంకా ట్రైలర్ రిలీజ్ కాలేదు. ప్రమోషన్లు కూడా ప్రారంభం కాలేదు.

విశ్వస‌నీయ‌ వర్గాల సమాచారం ప్రకారం సలార్ సినిమా వాయిదా పడినట్టే తెలుస్తోంది. అసలు ఎంతో ప్లానింగ్ తో సలాడ్ సినిమాను రిలీజ్ చేస్తారు అనుకుంటే సడన్గా ఎందుకు వాయిదా పడుతుంది.. అన్నదానిపై పెద్ద చర్చలు నడుస్తున్నాయి. సలార్‌ సినిమా డిజిటల్ రైట్స్ అమ్మకం ఇంకా పూర్తికానందునే ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్‌ చాలా జాగ్రత్తగా సినిమా తీస్తాడు. దుబారా కాస్ట్ ఉండ‌దు.

ఇక హోంబ‌లే వాళ్లు ధియేటర్ హక్కుల మీద పెట్టిన పెట్టుబడి రాబట్టుకొని.. సినిమాను థియేటర్లో సొంతంగా విడుదల చేసుకుంటున్నారు. గతంలో కేజిఎఫ్ సిరీస్ సినిమాలు కూడా అలాగే ఓన్ రిలీస్ చేసుకుని భారీ లాభాలు కళ్ల‌ చూశారు. అలాంటి నిర్మాతలు సలార్ సినిమాను ఆంధ్ర, తెలంగాణ అమ్మకానికి ప్రయత్నిస్తున్నారు. ఆంధ్ర 85 కోట్లు – నైజాం 80 కోట్లకు ఇవ్వాలనుకుంటున్నారు. ఇలా ఎందుకు ? జరుగుతుంది అనుకుంటే సలార్‌ సినిమా డిజిటల్ స్ట్రిమింగ్ హక్కులు.. అగ్రిమెంట్ ఇంకా జరగలేదని అమెజాన్ సంస్థతో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలుస్తోంది.

అయితే అమెజాన్ అంత పెద్ద పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం లేదంట. దీంతో సంప్రదింపులు ఇంకా కొనసాగుతూ ఉండడంతో సలార్ డిజిటల్ రూట్స్ ఇంకా అమ్మకం పూర్తి కాలేదని తెలుస్తుంది. అందుకే సలార్ నిర్మాతలు ఈ సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news