Newsవ‌ర‌ల్డ్‌వైడ్‌గా దుమ్ము రేపిన ' ఖుషి ' ఫ‌స్ట్ డే వ‌సూళ్లు......

వ‌ర‌ల్డ్‌వైడ్‌గా దుమ్ము రేపిన ‘ ఖుషి ‘ ఫ‌స్ట్ డే వ‌సూళ్లు… విజ‌య్ ఏందీ అరాచ‌కం…!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా.. స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్గా, దర్శకుడు శివ నిర్వాణ తెర‌కెక్కించిన సినిమా ఖుషి. ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా పలు భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సాలిడ్ పాజిటివ్ గా తెచ్చుకుని విజయ్ కెరీర్లో మంచి కం బ్యాక్ సినిమాగా నిలిచింది. సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చేసింది.

యూఎస్ లో ఇప్పటికే వన్ మిలియన్ డాలర్లకు దగ్గరగా చేరువైన ఈ సినిమా తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే నెంబర్లు సెట్ చేసింది. మేకర్స్ ఇచ్చిన అఫీషియల్ నెంబర్ ల ప్రకారం ఖుషి మొదట రోజు వరల్డ్ వైడ్ గా రు. 30 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబట్టి అదరగొట్టింది. చాలామంది ఈ స్థాయి ఓపెనింగ్స్‌ వస్తాయని అస్సలు ఊహించలేదు.

ఏది ఏమైనా మైత్రి మూవీ మేకర్స్ నుంచి మరో ట్రెండ్ సెట్ చేసే హిట్టు వచ్చేసింది అని చెప్పాలి. ఈ సినిమాతో విజయ్ లైగ‌ర్ లాంటి డిజాస్ట‌ర్‌ తర్వాత అదిరిపోయే హిట్ తన ఖాతాలో వేసుకున్నాడని చెప్పాలి. ఖుషి రానున్న రోజుల్లో సరికొత్త రికార్డులు సెట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news