Newsఅందరి ముందే కమెడియన్ సునీల్ చెంప పగలగొట్టిన స్టార్ హీరోయిన్... అస‌లేం...

అందరి ముందే కమెడియన్ సునీల్ చెంప పగలగొట్టిన స్టార్ హీరోయిన్… అస‌లేం జ‌రిగింది..!

కమెడియన్‌గా టాలీవుడ్ లో అడుగుపెట్టిన సునీల్ ప్రస్తుతం స్టార్ హీరోలకి విలన్ గా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. కలర్ ఫోటో సినిమాతో విలన్ గా మారిన సునీల్ ఓ పక్క కమెడియన్ గా సినిమాలు చేస్తూనే మరోపక్క విలన్ గా కూడా వరుస‌ సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే పుష్ప సినిమాలో విలన్ గా నటించిన సునీల్ కోలీవుడ్ సినిమాల్లో కూడా విలన్ గా, కమెడియన్గా సినిమాలు చేస్తున్నాడు.

అయితే అలాంటి సునీల్ కి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో స్టార్ హీరోయిన్ చేతిలో చెంప దెబ్బ తినాల్సి వచ్చిందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు సునీల్‌ను ఎందుకు కొట్టింది అనేది ఇక్కడ చూద్దాం. సునీల్ కేవలం కమెడియన్ గా, విలన్ గా మాత్రమే కాకుండా హీరోగా కూడా కొన్ని సినిమాల్లో నటించాడు. అంతేకాకుండా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మర్యాద రామన్న సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నాడు.

ముందుగా అందాల రాముడు సినిమాలో హీరోగా చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత పూలరంగడు, మిస్టర్ పెళ్ళికొడుకు, మర్యాద రామన్న వంటి సినిమాలు తో హీట్ అందుకున్నాడు. అయితే సునీల్ ఓ సినిమా షూటింగ్ లొకేషన్లో ఉన్నప్పుడు అందరితో సరదాగా అందరినీ నవ్విస్తూ ఆటపాటిస్తూ ఉండేవాడట. అంతేకాకుండా అందరిపై చాలా జోకులు పంచ్‌లు కూడా వేసేవాడట.

ఇలా ఎంతో జాలీగా ఉన్న సునీల్ ఒకసారి సినిమా షూటింగ్లో ఉన్న టైంలో ఓ స్టార్ హీరోయిన్ పై కూడా పంచులు వేస్తారట. అయితే ఆ పంచులు జోకులు నచ్చిని హీరోయిన్ అందరూ చూస్తుండగానే సునీల్ చెంప చెల్లుమనిపించిందట. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు త్రిష.. త్రిష- సునీల్ చెంప‌ మీద కొట్టిందనే వార్త గ‌తంలో టాలీవుడ్ వైర‌ల్‌ గా మారింది. అయితే సునీల్ మాత్రం ఈ విషయంపై ఏ విధంగా స్పందించలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news