Newsచిరంజీవి - అనుష్క జోడీకి అప్పుడే అడ్డంకులు...!

చిరంజీవి – అనుష్క జోడీకి అప్పుడే అడ్డంకులు…!

మెగాస్టార్ చిరంజీవి తాజాగా భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఈ సినిమా అనుకున్న అంచనాలు అందుకోలేదు. చిరంజీవి కొత్త సినిమా స్టార్ట్ కావడానికి మరికాస్త సమయం పట్టేలా ఉంది. భోళా శంకర్ సినిమా తర్వాత చిరంజీవి తన మోకాలికి సర్జరీ చేయించుకున్నారు. దీంతో చిరు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. కర్ర సాయంతో చిరంజీవి ఇంట్లోనే నడుస్తున్నట్టు తెలుస్తోంది.

ఏఎన్ఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌ ఫంక్షన్కు కూడా తాను రాలేకనే రామ్ చరణ్ ను పంపించారు. చిరంజీవి కాలి సర్జరీకి సంబంధించిన పనులు ఇంకా మిగిలి ఉన్నట్టు తెలుస్తోంది. చిరంజీవి ప్రస్తుతం రెండు సినిమాలకు ఓకే చెప్పారు. ఒకటి పెద్ద కుమార్తె కొణిదెల సుష్మిత నిర్మాతగా.. కురసాల కళ్యాణకృష్ణ దర్శకత్వం వహించే సినిమా కాగా రెండోది బింబిసారా దర్శకుడు వశిష్ఠ్‌ తెరకెక్కించే సినిమా. రెండో సినిమాను యువి క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

ఈ సినిమాకు అనుష్కను హీరోయిన్ గా ఫైనల్ చేశారు. అయితే అదే సమయంలో ఆమె ఓ మలయాళ సినిమాకు ఓకే చెప్పింది. దీంతో డేట్లు క్లాస్ అవుతున్నాయని తెలుస్తోంది. దీంతో చిరంజీవి పక్కన హీరోయిన్గా అనుష్కను కొనసాగించాలా లేదా మరో హీరోయిన్ను తీసుకోవాలా అన్న డిస్కషన్లు అయితే నడుస్తున్నట్టు తెలుస్తోంది.

గతంలో స్టాలిన్ సినిమాలో అనుష్క స్పెషల్ సాంగ్ లో నటించింది. ఈసారైనా చిరంజీవి – అనుష్క జోడిని పూర్తిస్థాయిలో తెరమీద చూద్దాం అనుకుంటే అడ్డంకులు తప్పడం లేదు. మరి ఆ అడ్డంకులు అధిగమించి వీరిద్దరూ జోడి కడతారా లేదా అన్నది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news