Moviesమోక్ష‌జ్ఞ డెబ్యూ సినిమాకు నాని డైరెక్ట‌ర్ ఫిక్స్‌..!

మోక్ష‌జ్ఞ డెబ్యూ సినిమాకు నాని డైరెక్ట‌ర్ ఫిక్స్‌..!

నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కి సంబంధించి గత నాలుగైదు సంవత్సరాలుగా ఎన్నో వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. బాలయ్య చెప్పిన విషయాలు మినహాయిస్తే అసలు మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ విషయంలో ఏ వార్తల నిజమో.. ఏ వార్తలు అబద్దమో అభిమానులకు అర్థం కావడం లేదు. అయితే మోక్షజ్ఞ లుక్స్ కూడా మారిన నేపథ్యంలో మోక్షజ్ఞ సినిమా ఎంట్రీకి తెరవెనక రంగం సిద్ధమవుతుందన్నది మాత్రం క్లారిటీ వస్తుంది

ముందుగా మోక్షజ్ఞ ఎంట్రీ సినిమా విషయంలో సీనియర్ దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఆదిత్య త్రిబుల్ 999 సినిమా ఉంటుంది అని.. గతంలో బాలయ్య హీరోగా ఇదే సంగీతం దర్శకత్వంలో వచ్చిన ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా వస్తుందంటూ ప్రచారం జరిగింది.
సింగీతం కూడా ఈ కథ పట్టుకుని బాలయ్య చుట్టూ చాలా రోజుల నుంచి తిరుగుతున్నాడు. అయితే బాలయ్య మాత్రం క్లారిటీ ఇవ్వటం లేదు.

ఇక లేటెస్ట్ సమాచారం ప్రకారం మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ డైరెక్టర్ల జాబితాలో నాని దసరా మూవీతో నానికి కెరీర్ పరంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల పేరు వినిపిస్తుండటం విశేషం. శ్రీకాంత్ ఓదెల టేకింగ్ అద్భుతంగా ఉంటుందని దసరా సినిమాతో ప్రూవ్ అయింది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం పెళ్లి చేసుకున్న శ్రీకాంత్ మోక్షజ్ఞ కోసం అద్భుతమైన కథ రెడీ చేసుకున్నాడని.. ఇప్పటికే దీనిని బాలయ్యకు కూడా వినిపించాడని తెలుస్తోంది.

ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల‌ రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరగనున్నట్లు సమాచారం. ఏది ఏమైనా మోక్షజ్ఞ లాంటి భారీ అంచనాలు ఉన్న నందమూరి హీరో తొలి సినిమాను డైరెక్ట్ చేయడం అంటే ఎలాంటి డైరెక్టర్ కు అయినా కత్తి మీద సామూలాంటిదే. మరి దసరా సినిమాతో హిట్ కొట్టిన శ్రీకాంత్ మోక్షజ్ఞను పరిచయం చేసే ఆ లక్కీ ఛాన్స్ దక్కించుకుంటాడా లేదా అన్నది చూడాలి.

ఇక బాలయ్య కూడా యంగ్ జనరేషన్ డైరెక్టర్ల దర్శకత్వంలోనే మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి నిర్మాతగా వ్యవహరించనున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news