Moviesఅవ‌తార్‌, కేజీయ‌ఫ్ 2 సీక్వెల్‌ను దాటేసిన ' జైల‌ర్‌ ' .....

అవ‌తార్‌, కేజీయ‌ఫ్ 2 సీక్వెల్‌ను దాటేసిన ‘ జైల‌ర్‌ ‘ .. ఇక్క‌డుంది ర‌జ‌నీ రా…!

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ తలైవ‌ర్ రజినీకాంత్ హీరోగా.. తమన్నా హీరోయిన్గా తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ తెర‌కెక్కించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు వస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్.. ట్రైలర్లు సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి.

ఈ సినిమా ఇప్పుడు ఫాన్‌ ఇండియా తో పాటు ఓవర్సీస్ మార్కెట్లో రిలీజ్ కు ముందే మాసివ్‌ ఫీట్ సెట్ చేస్తోంది. అదిరిపోయే రికార్డులు తన ఖాతాలో వేసుకుంటుంది. ఇక బెంగ‌ళూరు సిటీలో అయితే అవతార్ 2 , అలాగే కన్నడ ఇండస్ట్రీకి చెందిన కేజిఎఫ్ 2 సీక్వెల్స్ ని మించి రికార్డులు నమోదు చేస్తోంది. బెంగళూరులో ఇప్పుడు జైలర్ సినిమాకి అవతార్ 2, కేజీఎఫ్ 2 సీక్వెల్స్ ని మించిన షోలు కేటాయించినట్టుగా తెలుస్తోంది.

దీంతో రజిని స్టామినా ఏ లెవెల్ లో ఉండబోతుందో మరోసారి స్పష్టమైంది. బెంగ‌ళూరులో ఇప్ప‌టి వ‌ర‌కు అవతార్ 2 కి హ‌య్య‌స్ట్‌గా 1014 షోలు వేశారు. ఇక కేజీయఫ్ 2 కి 1037 షోస్ వేయగా… జైలర్ సినిమాకు ఏకంగా 1093 షోలు ప్రస్తుతానికి కేటాయించారు. దీంతో ర‌జ‌నీ బెంగ‌ళూరులో స‌రికొత్త రికార్డ్ న‌మోదు చేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news