Moviesస్టార్ హీరోయిన్‌పై స‌ల్మాన్‌ఖాన్ లైంగీక దాడి… స‌పోర్టుగా నిలిచిన కంగ‌నా…!

స్టార్ హీరోయిన్‌పై స‌ల్మాన్‌ఖాన్ లైంగీక దాడి… స‌పోర్టుగా నిలిచిన కంగ‌నా…!

ప్రేమ పేరిట‌ సల్మాన్ ఖాన్ తనపై శారీరక వేధింపులకు పాల్పడ్డాడని ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ సోమీ అలీ ఆరోపించిన సంగతి తెలిసిందే.. సోమీ అలీ 1990వ దశకంలో బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్. బాలీవుడ్ లో ఒక వెలుగు వెలగాలన్న ఆశలతో ఆమె ఇండస్ట్రీలోకి వచ్చింది. కెరీర్ ప్రారంభంలో ఆమెకు మంచి హిట్ సినిమాలు పడ్డాయి. ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ తో ఆమె ప్రేమలో పడటం ఇద్దరు పెళ్లి వరకు వెళ్లడం కూడా జరిగిపోయాయి.

చివరకు కార్డుల ప్రింటింగ్ కూడా జరిగిపోయింది. అయితే సల్మాన్ పెట్టే టార్చర్ భరించలేక సోమీ అలీ అత‌నికి గుడ్ బై చెప్పేసింది. ఆ తర్వాత ఆమె అమెరికా వెళ్లి సెటిల్ అయిపోయింది. తాజాగా చాలా సంవత్సరాల తర్వాత సల్మాన్ ఖాన్ తనను ఎలా > వేధించాడో సోమీ అలీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో తనకు మద్దతుగా నిలిచిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌కు సోమీ ఆలీ కృతజ్ఞతలు తెలిపింది.

ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కంగనాపెట్టిన పాత పోస్టును మరోసారి సోమీ అలీ షేర్ చేసింది. కంగనా ఎప్పుడు నిజం మాట్లాడుతుందని పొగిడేసింది. అంతేకాదు వాస్తవం ఎలా ఎంత బలంగా చెప్పాలో కూడా తెలిసిన నటీమణులలో కంగనా ఒకరు అంటూ ప్రశంసించింది. నేను ముందు సైలెంట్ గా బాధపడ్డాను గోంతు విప్పే ధైర్యం స్వేచ్ఛ లేనందుకు ఒంటరిగా ఎంతో ఆవేదన చెందాను.. నా స్వరం ఎన్నో బయటకు చెప్పలేని నిజాలను దాచేసింది అంటూ సోమీ తన ఆవేదన వ్యక్తం చేసింది.

ఇక సల్మాన్ ఖాన్ తో తాను ఉన్న ఎనిమిది సంవత్సరాలు తన జీవితంలో అత్యంత దరిద్రమైనవిగా పేర్కొన్న ఆమె తనను అగ్రీ – స్టుపిడ్ అని పిలుస్తూ తక్కువ చేసి చూశారని వాపోయింది. చివరకు సల్మాన్ తనతో ప్రేమలో ఉన్నప్పుడు కూడా తన స్నేహితుల ముందు ఎగతాళి చేసేవాడని మరోసారి గుర్తు చేసుకుంటూ సోమీ ఎమోషనల్ అయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news