Moviesస‌మంత మీద చైతు ఇలా కూడా రివేంజ్ తీర్చుకుంటున్నాడా ?

స‌మంత మీద చైతు ఇలా కూడా రివేంజ్ తీర్చుకుంటున్నాడా ?

టాలీవుడ్ హీరో నాగచైతన్య మాజీ భార్య స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండకు జోడిగా ఖుషి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ 1న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతుంది. నాగచైతన్యతో విడిపోయాక సమంత చాలాసార్లు చైతుతో పాటు అక్కినేని ఫ్యామిలీ పై పరోక్షంగా సెటైర్లు వేయటం లేదా కవ్వించే పనులు చేయటం చేస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు నాగచైతన్య కూడా సమంతను కవ్విస్తున్నాడా ? అంటే టాలీవుడ్ వర్గాలు అవునని చెవులు కోరుక్కుంటున్నాయి.

చైతు- సమంత భార్యాభర్తలుగా ఉన్నప్పుడు వీరిద్దరూ కాంబినేషన్లో మజిలీ సినిమా తెరకెక్కించాడు దర్శకుడు శివ నిర్వాణ. మజిలీ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. పైగా ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు చైతు- స‌మంత‌ భార్యాభర్తలు గా ఉండటం కూడా ఈ సినిమాకు బాగా కలిసి వచ్చింది. అయితే ఇప్పుడు వీరిద్దరూ విడిపోయారు.

సమంతతో ఖుషి సినిమా తెరకెక్కించాడు ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ‌. ఈ సినిమా తర్వాత ఇప్పుడు నాగచైతన్యతో తన తర్వాత సినిమాను తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. ఖుషి రిలీజ్ అయిన వెంటనే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలకానున్నట్టు సమాచారం. ప్రస్తుతం చైతు చందు ముండేటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. జాలర్ల బ్యాక్ డ్రాప్ లో రియలిస్టిక్‌ య‌క్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వ‌స్తోంది.

గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ముగిసిన వెంటనే శివ నిర్వాణ‌ దర్శకత్వంలో కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషన్ సినిమాలో చైతు నటించబోతున్నాడని తెలుస్తోంది. ఏది ఏమైనా గతంలో తాను స‌మంత‌ కలిసిన నటించిన సినిమాను డైరెక్ట్ చేసిన శివ‌తో.. ఇప్పుడు స‌మంత‌ సినిమా చేసిన వెంటనే చైతు కూడా సినిమా చేయటం అంటే స‌మంత‌ను కవ్వించడం అన్నట్టుగా ఉందన్న చర్చలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news