Moviesఈ స్టార్ డైరెక్ట‌ర్ల పాలిటిక్స్ చూశారా… ఎవ‌రు ఏ పార్టీ అంటే…!

ఈ స్టార్ డైరెక్ట‌ర్ల పాలిటిక్స్ చూశారా… ఎవ‌రు ఏ పార్టీ అంటే…!

ద‌ర్శ‌కులుగా ఉంటూ.. అగ్ర‌స్థానంలో పేరు తెచ్చుకున్న అనేక మంది త‌ర్వాత కాలంలో రాజ‌కీయాల బాట ప‌ట్టిన వారు ఒక్క తెలుగులోనే కాదు.. త‌మిళం క‌న్న‌డ భాష‌ల్లోనూ ఎక్కువ‌గా క‌నిపిస్తారు. త‌మిళ నాట అగ్ర ద‌ర్శ‌కులు బాల‌చంద‌ర్‌, బాలు మ‌హేంద్రలు ఇద్ద‌రూ కూడా జ‌య‌ల‌లిత‌కు అత్యంత విధేయులు అనే విష‌యం చాలా మందికి తెలియ‌దు. అనేక సినిమాల్లో బాలు మ‌హేంద్ర జ‌య‌ల‌లిత ప్ర‌భుత్వానికి అనుకూలంగా డైలాగులు రాయించారు.

బాలు మ‌హేంద్ర జ‌య‌ల‌లిత అన్నా, ఆమె ప్ర‌భుత్వం అన్నా ఎంతో ఇష్టంతో ఉండేవారంటారు. ఇక, బాల‌చంద‌ర్ అయితే.. స్వ‌యంగా ఎన్నిక‌ల ప్ర‌చారం స‌మ‌యంలో అనుకూల కామెంట్లు చేసేవారు. ఇక‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం కూడా.. డీఎంకే పార్టీకి అనుకూలం అనే విష‌యం తెలుసా ? ఈయ‌న‌కు .. దివంగ‌త సీఎం క‌రుణానిధికి మంచి స్నేహితుడు.

ఈయ‌న తీసిన ముంబై సినిమాలో ఒక‌టి రెండు సీన్ల‌కు క‌రుణానిధి మాట‌లు అందించారు. ముఖ్యంగా లైకిక వాదానికి అనుకూలంగా ఉన్న డైలాగులు (హీరో చెప్పేవి) క‌రుణానిధి అందించిన‌వే. అయితే.. ఆయ‌న పేరు ఉండ‌దు. ఇలా.. త‌మిళంలోనే కాదు.. తెలుగులోనూ అనేక మంది ద‌ర్శ‌కులు రాజ‌కీయాల‌తో సంబంధం ఉన్న‌వారే. ద‌ర్శ‌కుడు కోడి రామ‌కృష్ణ‌.. క‌మ్యూనిస్టు భావ‌జాలంతోనే జీవితాంతం జీవించారు.

ఇక‌, దాస‌రి నారాయ‌ణ రావు.. కాంగ్రెస్ కు అనుకూల‌మే కాదు.. కేంద్రంలో మంత్రిగా కూడా ప‌నిచేశారు. ఇక‌, మ‌రో ద‌ర్శ‌కుడు కే. రాఘ‌వేంద్ర‌రావు.. టీడీపీ వ్యూహాత్మ‌క క‌మిటీలో నాయ‌కుడు. ఇక బోయ‌పాటి శ్రీను కూడా టీడీపీకి అనుకూలంగా ప‌ని చేస్తారంటారు. మ‌రో ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ జ‌న‌సేన పార్టీ సిద్ధాంతాల‌ను రూపొందిస్తాడ‌న్న టాక్ తెలిసిందే. ఇక‌, ఇత‌ర చిన్నా చిత‌కా ద‌ర్శ‌కులు కూడా ఏదో ఒక పార్టీతో ముడి పెట్టుకున్న‌వారే కావ‌డం గ‌మ‌నార్హం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news