Movies"అది తెలిసి బాధపడ్డా"..ప్రెగ్నెన్సీ గురించి షాకింగ్ సీక్రేట్ ని బయటపెట్టిన ఉపాసన..!!

“అది తెలిసి బాధపడ్డా”..ప్రెగ్నెన్సీ గురించి షాకింగ్ సీక్రేట్ ని బయటపెట్టిన ఉపాసన..!!

మెగా కోడలు ఉపాసన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ..అందానికి అందం.. అనుకోవకి అనుకువ .. మంచితనానికి మంచితనం.. మన ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరో భార్య కూడా ఇంత టాలెంటెడ్ ఇంత మంచి మనసు ఉన్న వాళ్ళు లేరు అంటూ మెగా ఫ్యాన్స్ చెప్పుకు వస్తూ ఉంటారు . రీసెంట్గా మెగా కోడలు ఉపాసన ఓ పండు లాంటి పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. పెళ్లయిన దాదాపు 11 ఏళ్ల తర్వాత తమ మొదటి బిడ్డకు వెల్కమ్ చెప్పిన రామ్ చరణ్ – ఉపాసన ప్రెసెంట్ పేరంట్ హుడ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు సన్నిహితులు శ్రేయోభిలాషులు వాళ్లకి స్పెషల్ విషెస్ అందించారు. కాగా బిడ్డ పుట్టిన తర్వాత ఫస్ట్ టైం బయటకు వచ్చిన ఉపాసన తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన కొన్ని విషయాలను షేర్ చేసుకుంది. రీసెంట్గా మెగా కోడలు ఉపాసన అపోలో హాస్పిటల్ లో జరిగిన ఓ మంచి పనికి నాంది పలికింది. ఈ క్రమంలోనే ఉపాసన సింగిల్ మదర్స్ ప్రెగ్నెన్సీ టైంలో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కోసం ఓ కేరింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసింది.

దీనికి ప్రతి రూపాయి కూడా ఉపాసననే ఖర్చు పెడుతూ ఉండడం గమనార్హం. కాగా ఇలాంటి క్రమంలోనే ప్రెగ్నెన్సీ జర్నీ పై ఉపాసన షాకింగ్ కామెంట్స్ చేసింది. ” ప్రతి తల్లికి ప్రెగ్నెన్సీ అనేది ఎమోషనల్ జర్నీ.. బిడ్డకు ఏదైనా జరిగితే ఏమవుతుందో అని భయపడుతూ ఉంటారు . అలాంటి టైం లో పక్కన సపోర్ట్ అనేది ఉండాలి.. అలా సపోర్ట్ ఉన్నప్పుడు ఆ ఆనందానికి అవధులు ఉండవు . అలాంటి మధుర క్షణాలు నా లైఫ్ లో ఎన్నో ఉన్నాయి . నాకు చరణ్ లాంటి హస్బెండ్ దొరకడం నిజంగా నా అదృష్టం .. నా ప్రెగ్నెన్సీ టైంలో ప్రతి సెకండ్ నాపై కేరింగ్ తీసుకున్నాడు ..అయితే అందరికీ ఇలానే ఉండాలని లేదు కదా.. అప్పుడు నాకు అనిపించింది సింగిల్ మదర్ పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్ళు ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అని ..? అప్పుడే నాకు అనిపించింది వీకెండ్ హాస్పిటల్ లో ఒంటరి తల్లులకు ఉచితంగా ఓపిడి చికిత్స అందించాలని నిర్ణయించుకున్నాను . ఇలాంటి ఓ ఎమోషనల్ జర్నీలో నా వంతు సహాయం చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఇది కొంతమందికి హెల్ప్ అయినా కూడా నేను సంతోషంగా ఉంటాను “అంటూ చెప్పుకు వచ్చింది . దీనితో సోషల్ మీడియాలో ఉపాసన ప్రెగ్నెన్సీపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఉపాసనాలోని మంచితనం మరోసారి బయటపడింది అంటూ మెగా ఫ్యాన్స్ ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news