News"ఈసారి కంటెస్టెంట్లకి తడిసిపోవాల్సిందే".. బిగ్ బాస్ సీజన్ 7 అసలు...

“ఈసారి కంటెస్టెంట్లకి తడిసిపోవాల్సిందే”.. బిగ్ బాస్ సీజన్ 7 అసలు ట్విస్ట్ లీక్ చేసేసిన నాగార్జున..!!

ప్రజెంట్ కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న షో బిగ్ బాస్ 7. తెలుగు టెలివిజన్ చరిత్రలోనే అతి పెద్ద రియాలిటీ షో గా స్టార్ట్ అయిన బిగ్ బాస్ ఇప్పటికే ఆరు సీజన్లో కంప్లీట్ చేసుకుంది . ఒక ఓటిటి సీజన్ కూడా ముగిసింది . కాగా ఇలాంటి క్రమంలోనే త్వరలోనే బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రారంభం కాబోతుంది అంటూ అఫీషియల్ గా ప్రకటించింది స్టార్ మా . దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేస్తూ బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి సంబంధించిన లోగో రిలీజ్ చేసింది. అయితే ఎప్పటిలాగే ఈ సీజన్ కి హోస్టుగా నాగార్జుననే కన్ఫామ్ అయిపోయారు .

మొదటినుంచి ఈ సీజన్ కి విజయ్ దేవరకొండ లేదా రానా దగ్గుబాటి హోస్టుగా చేయబోతున్నారు అంటూ ప్రచారం జరిగింది. కానీ లాస్ట్ మూమెంట్లో ఊహించిన ట్వీస్ట్ ఇస్తూ నాగార్జున నే సీజన్ సెవెన్ కి కూడా హోస్టింగ్ చేయబోతున్నాడు అంటూ అఫీషియల్ ప్రకటన చేసింది స్టార్ మా . ఈ క్రమంలోనే త్వరలోనే ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలియజేయడానికి మరో కొత్త షో ని టెలికాస్ట్ చేస్తుంది స్టార్ మా . ఈ క్రమంలోనే గత ఆరు సీజన్స్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ బిబి షైనింగ్ స్టార్స్ అంటూ ఓ షోని కండక్ట్ చేస్తుంది .

యాంకర్ సుమ ఈ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తుంది . అయితే సగంలో ఈ షోలో నాగార్జున కూడా జాయిన్ అవుతారు. బీబీ షైనింగ్ స్టార్స్ ప్రోమో రీసెంట్గా విడుదల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత తాలూకా సీజన్ కంటెస్టెంట్స్ ఈ షోలో కనిపిస్తూ హంగామా చేయడం మనం గమనిస్తాం .” నాగార్జున రాగానే కుడి ఎడమైతే అన్నారు కదా దానికి అర్థం ఏంటి ..?”అంటూ అడుగుతుంది .

ఈ క్రమంలోనే నాగార్జున కొత్త రూల్స్ ..కొత్త గేమ్స్ ..కొత్త ఛాలెంజెస్ ఉంటాయి అంటూ వెల్లడించారు . ఈసారి షో లో చాలా కొత్త రూల్స్ తీసుకొచ్చారు మేకర్స్ అంటూ తెలుస్తుంది . అంతేకాదు ఎలిమినేషన్ వెంటనే హౌస్ నుంచి బయటికి రాకుండా సస్పెన్స్ క్రియేట్ చేస్తూ వాళ్లతో కూడా సరికొత్త టాస్క్ ప్లే చేస్తున్నారట . చూడాలి మరి బిగ్బాస్ సీజన్ సెవెన్ ఎలాంటి టిఆర్పి రేటింగ్స్ అందుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news