Newsవిడాకుల తరువాత ఫస్ట్ టైం అలాంటి పని చేసిన నీహారిక.. ఏకేస్తున్న...

విడాకుల తరువాత ఫస్ట్ టైం అలాంటి పని చేసిన నీహారిక.. ఏకేస్తున్న జనాలు..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో మెగా డాటర్ నిహారిక పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనకు బాగా తెలిసిన విషయమే . కాగా రీసెంట్ గానే నిహారిక తన వివాహ బంధాన్ని తెంచేసుకుంది . జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకొని తన దారి తనది అని లైఫ్ను ముందుకు తీసుకెళ్తుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పలువురు స్టార్స్ జనాలు ఆమెను ఓ రేంజ్ లో ఆటాడేసుకున్నారు . అయితే అలాంటివి ఏమాత్రం పట్టించుకోని నిహారిక లైఫ్ లో ముందుకు వెళ్తూ ఉంది . రీసెంట్గా నిహారిక మాదాపూర్ లోని హెచ్ఐసీసీ ని ఆదివారం ప్రారంభించింది .

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ..దేశంలో 350 మంది టాప్ డిజైనర్లు రూపొందించిన ఉత్పత్తులు ఉన్నాయని ” లగ్జరీ – ఫ్యాషన్ – జ్యువెలరీ -యాక్ససరిస్”.. తదితరు ఉత్పత్తులకు అందుబాటులో ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఆక్టివిస్ట్ ఎస్ సబితా రెడ్డి నటీమణులు ఐశ్వర్య వెల్లింగుల , శాన్వి మేఘన పాల్గొన్నారు. అయితే ఈ ప్రోగ్రాం లో నిహారిక చాలా అట్రాక్టివ్ గా ఉంది . స్టైలిష్ ఇండో వెస్ట్రన్ శారీని కట్టుకుని హెవీ జ్యూవెలరీ ని పెయిర్ అప్ చేసి చాలా స్టైలిష్ లుక్ లో మెరిసింది .

అయితే విడాకుల అఫీషియల్ గా ప్రకటించిన తర్వాత ఫస్ట్ టైం ఆమె ఇలా బయట కనిపించడంతో జనాలు ఏకిపారేస్తున్నారు . అంతేకాదు నీకు ఇలాంటివి ముఖ్యమా..? భర్తతో సంసారం చేసుకోవడం ముఖ్యమా? ఏం పనులు ఇవి నీహారిక అంటూ తిట్టిపోస్తున్నారు. అంతేకాదు మరికొందరు తప్పో ఒప్పో అయిపోయింది.. తన లైఫ్ తనను బతకనివ్వండి అంటూ నిహారికకు సపోర్ట్ చేస్తున్నారు . ఏది ఏమైనా సరే ఇంత నెగిటివ్ ట్రోలింగ్ జరుగుతున్న నిహారిక ఇంత ధైర్యంగా ఉంది అంటే ఆమె గట్స్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అంటున్నారు మెగా అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news