News"నేను ఏమన్నా బిర్యానీనా..?"..స్టేజీ పైనే ఒక్కోక్కడికి ఇచ్చిపడేసిన విశ్వక్ సేన్..అంత మాట...

“నేను ఏమన్నా బిర్యానీనా..?”..స్టేజీ పైనే ఒక్కోక్కడికి ఇచ్చిపడేసిన విశ్వక్ సేన్..అంత మాట అనేశావు ఏంటి “బ్రో”..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్స్ కోసం స్ట్రైట్ ఫార్వర్డ్ గానే మాట్లాడుతున్నారని చెప్పాలి . హిట్ కొట్టిన హిట్ కొట్టకపోయినా డేర్ మాత్రం గుండెల్లో కావాల్సినంత ఉంది అంటూ ప్రూవ్ చేస్తున్నారు కుర్రాళ్ళు . మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే స్టార్ హీరోగా ఎదుగుతున్న హీరోలైతే ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తున్నారు. తాజాగా అదే లిస్టులోకి ఆడ్ అయిపోయాడు టాలీవుడ్ యంగ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విశ్వక్సేన్ . ఆయన కెరియర్ ఎలా అప్ అండ్ డౌన్స్ మధ్య నలిగిపోయిందో మనకు తెలిసిందే. ఇప్పుడిప్పుడే వరుసగా హిట్లు కొడుతూ తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నారు . అయితే ఇలాంటి టైం లోనే ఆయన తొక్కేయడానికి కొందరు ట్రై చేస్తున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

రీసెంట్గా ఆయన బేబీ సినిమా వివాదంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్ మాట్లాడుతూ..” బేబీ సినిమా కథను హీరోకి చెప్పడానికి ట్రై చేశానని కానీ ఆయన కథ వినడానికి కూడా టైం లేదు అని నా పాత్రను రిజెక్ట్ చేశారని చెప్పుకొచ్చారు”. అయితే హీరో ఎవరు అనేది మాత్రంచెప్పలేదు. కానీ ఆయన కామెంట్స్ చేసిన 24 గంటలు తిరగకముందే సోషల్ మీడియాలో విశ్వక్సేన్ పోస్ట్ పెడుతూ “నో అంటే నో అంతే.. అరవకండి” అంటూ ఘాటుగా స్పందించారు. విశ్వక్సేన్ సైతం డైరెక్టర్ పేరు మెన్షన్ చేయలేదు . కానీ విశ్వక్సేన్ చేసిన ట్వీట్ ప్రకారం చూస్తే ఈ కామెంట్ సాయి రాజేష్ కె అని క్లియర్గా అర్థమైపోతుంది.

ఈ క్రమంలోనే రీసెంట్గా నిన్న రాత్రి జరిగిన “పేకమెడలు” అనే సినిమా టీజర్ వేడుకకు హాజరైన విశ్వక్సేన్ ఈ కాంట్రవర్సీ పై స్పందించారు . ఎవరు స్థాయిని బట్టి వారు బిజీగా ఉంటాం. ఎలాంటి సినిమాలు చేయాలో స్పష్టత లేనప్పుడు ఎదుటివారి సమయం వృధా చేయకుండా ఉండడమే బెటర్ ..ఆ క్రమంలో కలవలేం..అని దర్శకుడికి చెప్పడం తప్పు కాదు నేరం కాదు ..సినిమా కథ మొత్తం విని రిజెక్ట్ చేయడం కన్నా సినిమా మనకు సెట్ కాదని రిజెక్ట్ చేయడమే బెటర్ .. అది వాళ్ళకి బాధగా అనిపించొచ్చు ..కానీ నేను చేసిన పనే కరెక్ట్ ..చిన్న సినిమాల విజయవంతం అవుతుండటం చాలా మంచి విషయం . ఆ చిత్రానికి టీం కి నేను ఎప్పుడో శుభాకాంక్షలు కూడా చెప్పాను . కానీ సినిమా హిట్ అయిందని హెడ్ వెయిట్ ప్రదర్శించకూడదు . నేనేమీ బిర్యానిని కాదు అందరికీ నచ్చడానికి ..నేను అనే వాడిని ఎవరికి నచ్చాలో వాళ్ళకి నచ్చుతాను అంటూ కూసింత డైరెక్ట్ గానే ఘాటుగానే సాయి రాజేష్ కు ఇచ్చి పడేసాడు . దీంతో సోషల్ మీడియాలో బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ హీరో విశ్వక్సేన్ మధ్య వార్ మరింత స్థాయిలో పిక్స్ కి చేరింది. చూద్దాం సాయి రాజేష్ దీనికి కౌంటర్ ఎలా ఇస్తాడు..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news