Newsసెల్ఫీతో అభిమానులకి బిగ్ గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక-విజయ్ దేవరకొండల జంట.....

సెల్ఫీతో అభిమానులకి బిగ్ గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక-విజయ్ దేవరకొండల జంట.. వీళ్ల ఫ్యాన్స్ ని ఇక ఆపగలమా..?

సినిమా ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే . మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ టైంలోని స్టార్ హీరోగా మారి బిగ్ బడా హీరోలకి సైతం టఫ్ కాంపిటీషన్ ఇచ్చిన ఘనతను అందుకున్నాడు విజయ్ దేవరకొండ. ఒకప్పుడు విజయ్ దేవరకొండ పేరు చెప్తే జనాలకు పెద్దగా తెలియదు కానీ .. ఇప్పుడు విజయ్ దేవరకొండ పేరు చెప్తే పూనకాలు వచ్చినట్లు ఊగిపోతూ ఉంటారు జనాభా . ఓ స్టార్ హీరోకి ఉండాల్సిన ఫ్యాన్ ఫాలోయింగ్ కన్నా ఎక్కువ రేంజ్ తో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ ప్రజెంట్ ఖుషి సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు .

అంతేకాదు గౌతమ్ తిన్నూరితో మరో సినిమాని ఫిక్స్ చేసుకున్న విజయ్ దేవరకొండ ఆ తరువాత పరశురాం పేట్ల దర్శకత్వంలో మరో సినిమాకి కూడా ఫిక్స్ అయ్యాడు. ఇలాంటి క్రమంలోనే విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందనాల మధ్య ఉండాల్సిన ప్రేమ యవ్వారం చెడింది అంటూ వార్తలు వినపడ్డాయి. గీతగోవిందం సినిమాతో ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ కపుల్ గా మారిపోయిన విజయ్ – రష్మిక . ఈ సినిమా ద్వారా మంచి క్రేజ్ పాపులారిటి దక్కించుకున్నారు . ఆ తర్వాత నటించిన సినిమాలు హిట్ కాకపోయినా సరే మంచి పబ్లిసిటీ పాపులారిటీ దక్కించుకున్నారు.

అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ వీళ్ళు బ్రేకప్ చెప్పుకున్నారు అన్న వార్త బాగా ట్రెండ్ అయింది. అయితే వాటికి చెక్ పెడుతూ రీసెంట్గా రష్మిక మందన ఓ సెల్ఫీ పోస్టును తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు . విజయ్ దేవరకొండ రష్మిక మందన నటించిన వన్ ఆఫ్ ది సినిమా “డియర్ కామ్రేడ్” . ఈ సినిమా రిలీజ్ అయ్యి నాలుగేళ్లు పూర్తవుతుంది . దీంతో సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ అలాగే విజయ్ తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ “ఈ సినిమా ఎప్పటికీ నా లైఫ్ లో గుర్తుండిపోతుంది.. ఈ సినిమాకి ఎప్పటికీ నా మదిలో ప్రత్యేక స్థానం ఉంది” అంటూ నోట్ పెట్టుకు వచ్చింది. దీంతో విజయ్ – రష్మిక విడిపోయారు అన్న వార్తలకు చెక్ పడింది. వీళ్ల కాంబోలో మరో సినిమా వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ చెప్పుకొస్తున్నారు అభిమానులు . దీంతో ఇన్నాళ్లు బ్రేకప్ చెప్పుకున్నారు రష్మిక – విజయ్ అంటూ బాధపడిన అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక విజయ్ -రష్మిక ల ఫ్యాన్స్ ని ఆపగలమా అంటూ జనాలు కామెంట్స్ కూడా చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news