Movies5 సార్లు రిపీట్ అయిన అదే హిట్ సెంటిమెంట్ రిపీట్ చేస్తున్న...

5 సార్లు రిపీట్ అయిన అదే హిట్ సెంటిమెంట్ రిపీట్ చేస్తున్న ఎన్టీఆర్.. దేవ‌ర‌ కూడా బ్లాక్ బ‌స్ట‌రే పక్కా..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు .. కొన్ని కొన్ని సెంటిమెంట్స్ భలే వర్కౌట్ అవుతూ ఉంటాయి . ఒకసారి ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే చాలు మళ్ళీ మళ్ళీ అదే సెంటిమెంట్ రిపీట్ చేయడానికి చూస్తూ ఉంటారు హీరోలు . అయితే కొన్నిసార్లు వాళ్ళు రిపీట్ చేయకూడదు అనుకున్నా సరే ..అది అలా వచ్చేస్తూ ఉంటుంది . అలాంటి ఒక క్రేజీ సెంటిమెంట్ మరోసారి ఎన్టీఆర్ లైఫ్ లో రిపీట్ కాబోతుంది . ఒకవేళ నిజంగా ఇది నిజమైతే మాత్రం ఎన్టీఆర్ తర్వాత నటిస్తున్న దేవర సినిమా సూపర్ డూపర్ బిగ్ బ్లాక్ బస్టర్ అవడం పక్క అంటున్నారు సినీ ప్రముఖులు .

కాగా ఎన్టీఆర్ ఎంతమంది డైరెక్టర్స్ డైరెక్షన్లో పనిచేశారో మనకు తెలిసిందే. అయితే ఇక్కడ ఒక క్రేజీ సెంటిమెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ హిట్ సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు. వరుస ఫ్లాపుల్లో ఉన్న డైరెక్టర్ తో ఆయన సినిమా తీస్తే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఇప్పటికి ఇది ఒకటి రెండు సార్లు కాదు ఏకంగా ఐదు సార్లు రిపీట్ అయింది . వంశీ పైడి పల్లి మొదట ప్రభాస్ తో మున్నా సినిమా చేయగా అది అట్టర్ ఫ్లాప్ అయింది .. ఆ తర్వాత వంశీ పైడిపల్లి వైపు ఎవరు చూడనే చూడలేదు.. కానీ ఎన్టీఆర్ నమ్మి ఛాన్స్ ఇచ్చాడు . వారి కాంబోలో వచ్చిన బృందావనం సినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే.

అలాగే మహేష్ బాబు బిజినెస్మెన్ తర్వాత నాలుగేళ్లు ఫ్లాప్స్ లో కూరుకుపోయారు పూరి జగన్నాధ్. ఫైనల్లీ టెంపర్ సినిమాతో మళ్ళీ ఎన్టీఆర్ హిట్ ఇచ్చాడు. ఆ తర్వాత మహేష్ బాబు నేనొక్కడినే సినిమా ఎంత డిజాస్టర్ టాక్ ను సంపాదించుకుందో తెలిసిందే. అయితే వరుస ఫ్లాప్స్ లో ఉన్న సుకుమార్ కు నాన్నకు ప్రేమతో సూపర్ డూపర్ హిట్ అందించాడు ఎన్టీఆర్ . ఆ తర్వాత బాబీ – సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఫ్లాప్ తో ఆయన పట్టించుకునే దిక్కే లేకుండా పోతే ..ఎన్టీఆర్ అవకాశం ఇచ్చాడు .

వీరిద్దరూ కలయికలో వచ్చిన జై లవకుశ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం మనకు తెలిసిందే . కాగా ఫైనల్లీ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ అందుకున్న త్రివిక్రమ్ కి ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ఇచ్చాడు . ఇదే కన్ఫామ్ ఐతే కొరటాల శివ – ఆచార్య ఫ్లాప్ తో బాధపడుతున్నాడు . దీంతో నెక్స్ట్ చేస్తున్న ఎన్టీఆర్ సినిమా కావడంతో ఖచ్చితంగా దేవర సినిమా ఇండస్ట్రీని తిరగరాసే హిట్ అవుతుంది అంటున్నారు అభిమానులు . చూద్దాం మరి ఏం జరుగుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news