Moviesవరుణ్-లావణ్యల పెళ్ళి అక్కడే.. ప్రేమ పుట్టిన చోటే పెళ్లి.. భలే...

వరుణ్-లావణ్యల పెళ్ళి అక్కడే.. ప్రేమ పుట్టిన చోటే పెళ్లి.. భలే కలిసొచ్చిందే..!!

ఫైనల్లీ ఎట్టకేలకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రేమించిన అమ్మాయి లావణ్య త్రిపాఠిను పెళ్లి చేసుకోవడానికి అన్ని సర్వం సిద్ధం చేసుకున్నాడు. నిశ్చితార్ధం కూడా అయిపోయింది . త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకొని ఒకటి కాబోతున్నారు . ఇన్నేళ్లు ఎవరికి తెలియకుండా సైలెంట్ గా ప్రేమాయణం సాగించిన వరుణ్ తన కోస్టార్ లావణ్య త్రిపాఠిని నిన్న హైదరాబాద్లో తన ఇంట్లో గ్రాండ్గా నిశ్చితార్థం చేసుకొని దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.

మెగా ఫ్యామిలీ లావణ్య త్రిపాఠి కుటుంబ సభ్యుల సమక్షంలో శుక్రవారం రోజున నిశ్చితార్ధం చాలా గ్రాండ్ గా జరిగింది. కాగా సోషల్ మీడియాలో వీరి ఎంగేజ్మెంట్ పిక్స్ వైరల్ అవుతున్న తరుణంలో వీరిద్దరు పెళ్లి ఎప్పుడు ఉంటుంది .. ఆ వెడ్డింగ్ డెస్టిని.. ఎక్కడ..? అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అయితే అందుతున్న సమాచారం ప్రకారం వీళ్ళిద్దరి పెళ్లి ఇటలీలో జరగబోతుందట . దానికి కారణం కూడా ఉంది .

వాళ్ళ ప్రేమ చిగురించింది ఇటలీలోనే . మిస్టర్ సినిమా షూటింగ్లో భాగంగా వీళ్లిద్దరు ఇటలీ వెళ్లారు . ఆ టైంలోనే వీరిద్దరూ మనసులు కలిసి ప్రేమ పుట్టింది . అందుకే తమ ప్రేమకు గుర్తుగా ఇటలీ వీళ్ల వెడ్డింగ్ డెస్టినేషన్ గా మారింది . దీంతో సోషల్ మీడియాలో వీళ్ళిద్దరి పెళ్లి వార్త వైరల్ గా మారింది . వరుణ్ తేజ్ లావణ్యలకు ఇటలీ లవ్ సెంటిమెంట్ కూడా కలిసి వస్తుంది అన్న కారణంతో మెగా ఫ్యామిలీ కూడా ఇందుకు ఒప్పుకుందట . మొత్తానికి మన మెగా హీరో వరుణ్ తేజ్ కూడా ఓ ఇంటి వాడు అయిపోయాడు . ఇక ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో..? అంటూ వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news