Movies"ఈ పేరు శానా ఏండ్లు యాదుంటది".. భగవంత్ కేసరి టీజర్ వచ్చేసిందోచ్.....

“ఈ పేరు శానా ఏండ్లు యాదుంటది”.. భగవంత్ కేసరి టీజర్ వచ్చేసిందోచ్.. మాస్ స్టఫ్ తో మాసివ్ డైలాగ్స్.. కుమ్మి పడేసావ్ పో బాలయ్య..!!

టాలీవుడ్ నటసింహం గా పాపులారిటీ సంపాదించుకున్న నందమూరి బాలయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా “భగవంత్ కేసరి”. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . అంతేకాదు వీరసింహారెడ్డి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య చేస్తున్న సినిమా ఇదే కావడంతో సినిమాలు జనాలు ఈ సినిమాపై రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే ఈరోజు బాలయ్య పుట్టినరోజు సందర్భంగా కొద్దిసేపటి క్రితమే ఈ సినిమాకి సంబంధించిన పవర్ఫుల్ మాసివ్ టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్ .

టీజర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బాలయ్య లోని ప్రతి క్వాలిటీని .. ప్రతి యాంగిల్ ని చాలా పవర్ ఫుల్ గా చూపించి నందమూరి అభిమానులను సాటిస్ఫై చేశాడు అనిల్ రావిపూడి. అంతేకాదు సినిమాలో మాస్ పవర్ఫుల్ డైలాగ్స్ కూడా పెట్టి బాలయ్య అనిల్ రావిపూడి సినిమాపై ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు . కాగా బాలయ్య నోటి నుండి వచ్చిన పవర్ఫుల్ డైలాగ్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచిపోతున్నాయి అంటూ తెలిసిపోతుంది.

మరీ ముఖ్యంగా బాలయ్య తెలంగాణ యాసలో చెప్పిన “రాజు ఆని వెనక ఉన్న వందల మంది మందను చూపిస్తాడు ..అదే మొండోడు ఆయనకున్న ఒకే ఒక గుండెను చూపిస్తాడు” అంటూ తెలంగాణ భాషలో అదరగొట్టేశారు . అంతేకాదు సినిమాలో మాస్ ఫైట్స్ అద్భుతంగా ఉండబోతున్నాయి అంటూ చిన్న టీజర్ తోనే రచ్చ రంబోలా చేసేసాడు అనిల్ రావిపూడి. దీంతో సోషల్ మీడియాలో కొద్దిసేపటికి రిలీజైన భగవంత్ కేసరి టీజర్ వైరల్ గా మారింది.

అంతేకాదు ఈ లుక్స్ ఆధారంగా ఇప్పటివరకు మనం బాలయ్యని ఈ యాంగిల్ లో చూడలేదు అని తెలిసిపోతుంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా శ్రీలీల కూతురి పాత్రలో కనిపించబోతుంది. అర్జున్ రాంపాల్ విలన్‌గా నటిస్తున్నారు. భగవంత్ కేసరి చిత్రాన్ని షైన్ స్క్రీన్స్‌ సినిమాస్ పతాకంపై సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ” భగవంత్ కేసరి” టీజర్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది . ఏది ఏమైనా సరే ఈ సినిమాతో కూడా బాక్సాఫీస్ రికార్డును తిరగ రాయడం పక్క అంటున్నారు నందమూరి అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news