Moviesసాయిధరమ్ తేజ్ కి ఆ హీరోయిన్ అంటే అంత ఇష్టమా..? ఆమె...

సాయిధరమ్ తేజ్ కి ఆ హీరోయిన్ అంటే అంత ఇష్టమా..? ఆమె కోసం అలాంటి పని కూడా చేశాడా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సగానికి పైగా మెగా హీరోలు ఆకుపై చేశారన్న విషయం అందరికీ తెలిసిందే.  మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలో రాజ్యమేలుస్తున్న హీరోలు బోలెడు మంది ఉన్నారు . మెగా ట్యాగ్  తగిలించుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోలలో సాయిధర్మతేజ్ కూడా ఒకరు. పిల్ల నువ్వులేని  జీవితం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో మొదటి సినిమాతోనే మల్టీ టాలెంటెడ్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు .

ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ సుప్రీం హీరోగా ఎదిగాడు. రీసెంట్ గానే విరుపాక్ష సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న సాయి ధరమ్ తేజ్ కి హీరోయిన్ సాయి పల్లవి అంటే చాలా చాలా ఇష్టమట . అంతే కాదు  తన ఫేవరెట్ హీరోయిన్ సమంత అయినా సరే సాయి పల్లవి నటన అంటే చాలా ఇష్టం అని ..ఆ కారణంగానే సాయి పల్లవి తో సినిమా చేయాలని అనుకున్నారట.

కానీ చాలా సార్లు ఆ ఛాన్స్ మిస్ అయిందని..  సాయి పల్లవి తన సినిమా కథలను రిజెక్ట్ చేసిందని బాధపడ్డారట.  ఈ క్రమంలోనే ఆమె కోసమే లేడీ ఓరియంటెడ్ ఫిలిం చేసి ఆ సినిమాలో సాయిధరమ్ తేజ్ చిన్న పాత్రకు భాగం కావాలని చూసారట.  అంత పిచ్చి ఇష్టం సాయి పల్లవి అంటే సాయి ధరంతేజ్ కు అన్న న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news