Moviesఆ నాలుగు రూల్స్ పాటిస్తే చాలు... ' మోక్ష‌జ్ఞ ' కు...

ఆ నాలుగు రూల్స్ పాటిస్తే చాలు… ‘ మోక్ష‌జ్ఞ ‘ కు టాలీవుడ్‌లో తిరుగే ఉండ‌దు…!

నందమూరి కుటుంబం నుంచి ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడానికి మరో హీరో రెడీ అయిపోతున్నారు. సినీ ఎంట్రీ కూడా ఫిక్స్ అయిపోయిందని టాక్ నడుస్తోంది. ఆయనే నందమూరి మోక్షజ్ఞ. అవును మోక్షజ్ఞ సినీ ఇండస్ట్రీలో గ్రాండ్ గా లాంచ్ కానున్నారు అని అంటున్నారు. డైరెక్టర్ ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కానీ మోక్షజ్ఞ షూట్ లో అయితే పాల్గొననున్నారు అని సమాచారం.

జూనియర్ ఎన్టీఆర్ తరువాత అంత ఎదిగే సత్తా నందమూరి కుటుంబంలో మోక్షజ్ఞకే ఉండనే టాక్ కూడా గట్టిగానే నడుస్తోంది. మోక్షజ్ఞ డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్ డెలివరీ, ఇతర అంశాలకు సంబంధించి మోక్షజ్ఞ శిక్షణ కూడా తీసుకున్నారని, ఇక ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ నాలుగు లక్షణాలు ఉంటే మాత్రం మోక్షజ్ఞను ఆపడం ఎవరి తరం కాదని నందమూరి ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.

ఈ నాలుగు విషయాల్లో కాన్ఫిడెంట్ గా ఉంటె మాత్రం మోక్షజ్ఞ కెరీర్ విషయంలో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాలను మోక్షజ్ఞ కూడా గుర్తు పెట్టుకోవాలని, ఇలా చేస్తే త్వరగా టాప్ హీరో అయిపోతారని మాట్లాడుకుంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. నందమూరి ఫ్యామిలీ అంటే మొదట గుర్తొచ్చేది డైలాగ్స్. మోక్షజ్ఞ నుంచి కూడా ఫ్యాన్స్ అద్భుతమైన డైలాగ్ డెలివరీ, టైమింగ్ ఆశిస్తున్నారు.

బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్స్ ఎలా చెబుతారో, ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. అందుకే మోక్షజ్ఞ కూడా అద్భుతమైన డైలాగ్ డెలివరీతో మెప్పించాలి. ఆ తరువాత ఫ్యాన్స్ ఎక్కువగా ఆశించేది అద్భుతమైన డ్యాన్స్, యాక్షన్ సీక్వెన్స్. నందమూరి ఫ్యామిలీలో ఇవి చాలా ముఖ్యం. ఈ విషయాలలో కూడా మోక్షజ్ఞ కచ్చితంగా ఫ్యాన్స్ ను ఆకట్టుకోవాల్సి ఉంది.

ఇతర హీరోలకు భిన్నంగా నటన విషయంలో, డ్రెస్సింగ్ విషయంలో మోక్షజ్ఞ తన ప్రత్యేకతను చాటుకోవాల్సిందే, ఈ విషయాలలో మెప్పిస్తే సైతం మోక్షజ్ఞకు కెరీర్ పరంగా తిరుగుండదని టాక్ నడుస్తోంది. మరి ఈ విషయాలకు సంబంధించి మోక్షజ్ఞ ఏ విధంగా ముందుకెళతారో, మరేమైనా కొత్త ఆలోచనలతో వస్తారేమో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news