Moviesఆమెను హీరోయిన్‌గా తీసుకుంటారా… సినిమా అట్ట‌ర్‌ప్లాపే…!

ఆమెను హీరోయిన్‌గా తీసుకుంటారా… సినిమా అట్ట‌ర్‌ప్లాపే…!

దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు, క‌ళా త‌పస్వి కే. విశ్వ‌నాథ్ ఏదైనా ప్రాజెక్టు పెట్టుకుంటే.. దానికి ఖ‌ర్చును ఆయ‌న నిలువ రించే ప్ర‌య‌త్నం చేసేవారు. క‌థ‌లో ద‌మ్మును బ‌ట్టి.. సినిమా ఆడాలే త‌ప్ప‌.. హీరోలు, హీరోయిన్లు డామినేట్ చేయ‌డం ఏంట‌నిఅనేవారు. అందుకే ఆయ‌న సినిమాలు తీసుకుంటే.. పెద్ద‌గా పేరున్న హీరోలు మ‌న‌కు క‌నిపించ‌రు. ఒక్క చిరంజీవితో మాత్రం రెండు సినిమాల చేశారు. దీనిలోనూ స్వ‌యం కృషి ఒక్క‌టే 100 రోజులు ఆడింది. త‌ర్వాత తీసిన ఆప‌ద్బాంధ‌వుడు ఫెయిల్ అయింది.

ఇక‌, వెంక‌టేష్‌తోనూ.. విశ్వ‌నాథ్ రెండు సినిమాలు చేశారు. ఇవి కూడా అంతే. ఒక‌టి మాత్ర‌మే(స్వ‌ర్ణ క‌మ‌లం ) హిట్‌. రెండోది ఫ‌ట్. ఇక‌, విష‌యానికి వ‌స్తే.. 1979లో విశ్వ‌నాథ్ తీసిన శంక‌రాభ‌రణం సూప‌ర్ హిట్ సాధించి న విష‌యం తెలిసిందే.అయితే.. ఈ సినిమా కోసం.. శోభ‌న్‌బాబును అనుకున్నారు. కానీ, క‌థ విన్నాక బాగుంద‌ని అన్నా.. కాల్ షీట్లు ఖాళీ లేవ‌న్నారు. దీంతో కొంత హ‌ర్ట్ అయిన‌.. విశ్వ‌నాథ్‌.. వీళ్లెవ‌రూ త‌న‌కు అవ‌స‌రం లేద‌న్నారు.

ఈ క్ర‌మంలోనే గ‌తంలో తీసిన సినిమాకు అనుమ‌తులు ఇచ్చిన డిప్యూటీ క‌లెక్ట‌ర్ సోమ‌యాజులును హీరోగా ప‌రిచ‌యం చేశారు. ఇది కొంత ఆశ్చ‌ర్యం. అయినా.. ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఇక‌, హీరోయిన్‌గా జ‌య‌ప్ర‌ద ను అనుకున్నారు. కానీ, హీరోయిన్ ప్రౌఢంగా ఉండ‌డం.. డ్యూయెట్లు లేక పోవ‌డం.. మాట‌లు కూడా పెద్ద‌గా లేక‌పోవ‌డంతో ఆమె కూడా కాల్షీట్లు ఇవ్వ‌లేదు. దీంతో ఆమెను కూడా ప‌క్క‌న పెట్టి.. అప్ప‌టి వ‌రకు పెద్ద‌గా ఎవ‌రికీ తెలియ‌ని మంజు భార్గ‌విని ప‌రిచ‌యం చేశారు.

అయితే..అప్ప‌టికే ఆమె క‌న్న‌డ సినిమాల్లో న‌టించారు. కానీ అక్క‌డ ఐర‌న్ లెగ్ అనే ముద్ర వేసుకుంది. దీంతో ఆమెను విశ్వ‌నాథ్ తీసుకోవ‌డంతో ఈ సినిమా ఫ‌ట్టే అని ప్ర‌చారం చేశారు. కానీ, నిర్మాత ఏడిద నాగేశ్వ‌ర‌రావుకు విశ్వ‌నాథ్‌పై ఉన్న అభిమానంతో కాద‌న‌లేక పోయారు. ఇక‌, ఈ సినిమా ఎంత పేరు వ‌చ్చిందో అంద‌రికీ తెలిసిందే. మంజు భార్గ‌వి త‌ర్వాత కాలంలో తెలుగులోనూ మంచి పేరు తెచ్చుకుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news