Moviesబ్రేకింగ్‌: బాల‌య్య 109 సినిమా ఆ స్టార్ డైరెక్ట‌ర్‌తోనే… రిలీజ్ టైం...

బ్రేకింగ్‌: బాల‌య్య 109 సినిమా ఆ స్టార్ డైరెక్ట‌ర్‌తోనే… రిలీజ్ టైం కూడా…!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ వ‌రుస పెట్టి గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. అఖండ‌.. ఆ త‌ర్వాత వీర‌సింహారెడ్డి రెండు సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తోన్న సినిమా షూటింగ్ కూడా శ‌ర‌వేగంగా న‌డుస్తోంది. ఈ సినిమాను ఈ ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌చ్చేలా స్పీడ్‌గా షూటింగ్ చేస్తున్నారు.

ఈ సినిమా త‌ర్వాత బాల‌య్య ఏ సినిమా చేస్తాడు ? ఏ డైరెక్ట‌ర్‌తో బాల‌య్య సినిమా ఉంటుంద‌న్న దానిపై ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. బాల‌య్య 109వ సినిమా డైరెక్ట‌ర్ ఎవ‌రు ? అన్న చ‌ర్చ చాలా రోజుల నుంచి న‌డుస్తూనే వ‌స్తోంది. పూరి జ‌గ‌న్నాథ్‌, బోయ‌పాటి శ్రీను, ప్ర‌శాంత్ వ‌ర్మ ఇలా చాలా పేర్లు వినిపించాయి.

అయితే ఎట్ట‌కేల‌కు బాల‌య్య 109వ సినిమాపై క్లారిటీ వ‌చ్చేసింది. బాల‌య్య‌కు క‌లిసొచ్చిన బోయ‌పాటితోనే బాల‌య్య నెక్ట్స్ ఫిక్స్ అయ్యింది. ఇది వీరిద్ద‌రి కాంబోలో నాలుగో సినిమా అవుతుంది. సింహా, లెజెండ్‌, అఖండ త‌ర్వాత ఇది నాలుగో సినిమా అవుతుంది. అఖండ‌కు సీక్వెల్‌గా అఖండ 2 ఇప్పుడు వీరి కాంబోలో రాబోతోంది.

ప్ర‌స్తుతం రామ్ తో బోయపాటి చేస్తున్న సినిమా లేట్ కావడంతో బాలయ్య ఈ గ్యాప్ లో మరో సినిమా చేస్తాడ‌ని వార్త‌లు వ‌చ్చినా అది అబ‌ద్ధం అని తేలిపోయింది. వ‌చ్చే ఎన్నిక‌లు మార్చి లేదా ఏప్రిల్లో ఉండే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం బాల‌య్య చేస్తోన్న సినిమా షూటింగ్ త్వ‌ర‌గా ముగించేసి ఆ వెంట‌నే బోయ‌పాటి సినిమాను ప‌ట్టాలెక్కించి ఎన్నిక‌ల‌కు కొద్ది రోజుల ముందే రిలీజ్ చేసే ప్లాన్ చేసుకుంటున్నారు.

ఈ క్ర‌మంలోనే బాల‌య్య – బోయ‌పాటి మ‌ధ్య రెండు రోజులుగా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయ‌ట‌. ద‌ర్శ‌కుడు బాబి మాంచి మాస్ క‌థ‌తో బాల‌య్య ద‌గ్గ‌ర‌కు వెళ్లాడ‌ని.. అయితే బాల‌య్య ఫ‌స్ట్ ప్రిప‌రెన్స్ బోయ‌పాటి కావ‌డంతో బోయ‌పాటితోనే బాల‌య్య నెక్ట్స్ క‌న్‌ఫార్మ్‌గా ఉంటుందంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news