Moviesవార్నీ.. మహేష్‌ - త్రివిక్రమ్‌ ల మధ్య గొడవకి అసలు కారణం...

వార్నీ.. మహేష్‌ – త్రివిక్రమ్‌ ల మధ్య గొడవకి అసలు కారణం అదేనా..? ఇంత పెద్దది గా చేసుకున్నారా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు.. ప్రెసెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న సినిమా ఎస్ ఎస్ ఎం బి 28 . మాటల మాత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది . మూడో షెడ్యూల్ కూడా పూర్తవ్వాల్సి ఉంది . కానీ మహేష్ బాబు పలుసార్లు ఈ సినిమాకు బ్రేక్ వేయడంతో సినిమా షెడ్యూల్ ఆలస్యంగా ముందుకు వెళుతుంది. ఈ క్రమంలోని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కూడా మహేష్ బాబు పై యాంగ్రీ గా ఉన్నట్లు తెలుస్తుంది.

అంతేకాదు మహేష్ బాబు త్రివిక్రమ్ మధ్య యవ్వారం చెడ్డింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఆ కారణంగానే మహేష్ బాబు ఈ సినిమా షూట్ కి బ్రేక్ వేసి మరి ఫారిన్ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నాడు అంటూ సినిమా ఇండస్ట్రీలో న్యూస్ హల్చల్ చేస్తుంది . దానికి కారణం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఈ స్క్రిప్ట్ పరంగా కొన్ని తప్పులు చేస్తున్నారని ఫుల్ యాక్షన్ సీన్స్ లో కొన్ని పొరపాట్లు చేస్తున్నారని ..అవే విషయాలు మహేష్ బాబు ఎత్తి చూపక త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఆయన మాటలు పట్టించుకోకుండా అదే తప్పుని మళ్ళీ చేస్తున్నారు అని ..త్రివిక్రమ్ పై మహేష్ బాబు ఫైర్ అవుతున్నారట .

ఆ కారణంగానే ప్రాజెక్ట్ నుంచి బయటకు రాలేక ప్రాజెక్టును కంటిన్యూ చేయలేక ఇలా బ్రేక్ మీద బ్రేక్ వేసుకుంటూ షూటింగ్ లేట్ చేస్తున్నారన్న న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ త్రివిక్రమ్ పై గుర్రుగా ఉన్నారు . మరోపక్క త్రివిక్రమ్ ఎక్కువగా పవన్ కళ్యాణ్ సినిమాల పైన ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నాడన్న రూమర్ ఎప్పటినుంచో వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తప్పిస్తే త్రివిక్రమ్ కి ఎవరు కనిపించరని.. ఆయన సినిమాలకే ప్రాణం పెట్టి డైరెక్షన్ చేస్తాడని ..మిగతా సినిమాలను లైట్గా తీసుకుంటాడని మహేష్ బాబు ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు..!! ఇంత చిన్న విషయాని కూర్చోని సాల్వ్ చేసుకోకుండా..ఇంత పెద్దదిగా చేసుకున్నారా..? వీళ్లు అంటూ జనాలు నవ్వుకుంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news