Moviesశ్రీ లలితా పెళ్లి చేసుకోబోతున్న ఈ అబ్బాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటో...

శ్రీ లలితా పెళ్లి చేసుకోబోతున్న ఈ అబ్బాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..? స్టార్ హీరోలకి మించిపోయే రేంజ్..!

ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో ఉండే చాలామంది స్టార్ సెలబ్రిటీస్ ప్రేమ-నిశ్చితార్ధం- పెళ్లి – ప్రెగ్నెన్సీ విషయాలను గుట్టూ చప్పుడు కాకుండా దాచేస్తున్నారు . దిష్టి తగులుతుంది అన్న భయమో లేకపోతే మరి ఏదైనా కారణమో తెలియదు కానీ చాలామంది సైలెంట్ గా తమ ప్రేమ విషయాన్ని తీరికగా ఓపెన్ గా తర్వాత బయట పెడుతున్నారు . రీసెంట్ గా అలాంటి ఒక న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని అమ్మాయి పేరు శ్రీ లలిత . టాప్ సింగర్ ..

పాడుతా తీయగా ..స్వరాభిషేకం ..లిటిల్ ఛాంప్స్.. సరిగమప ప్రోగ్రామ్స్ లో బాగా పాటలు పాడి ఆకట్టుకుంది . మరీ ముఖ్యంగా శ్రీ లలిత ట్రెడిషనల్ సాంగ్స్ పాడితే మనసుకు హాయిగా ఉంటుంది . చాలామంది స్టార్ సింగర్స్ ని ఇమిటేట్ చేస్తూ ఉంటుంది . గతంలో ఓ ప్రోగ్రాంలో గీతామాధురి అదేవిధంగా సింగర్ సునీతని ఎలా ఇమిటేట్ చేసిందో చూసాము. అంతేకాదు కాంతారా సినిమాలోని వారాహి పాటను తనదైన స్టైల్ లో పాడి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది .

ఈ శ్రీ లలిత ఎంగేజ్మెంట్ చేసుకుంది . దానికి సంబంధించిన పిక్చర్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. చాలా ట్రెడిషనల్ గా సంప్రదాయ బద్దంగా ఉండే శ్రీలలిత అంతకంటే సాంప్రదాయపద్ధంగా పద్ధతులను ఫాలో అవుతూ నిశ్చితార్థం చేసుకుంది. శ్రీ లలిత పెళ్లి చేసుకోబోయే అబ్బాయి స్టార్ హీరోకి మించిపోయిన రేంజ్ లో కటౌట్ ఉండడంతో ..ఇతగాడు ఎవరా ..?ఏం చేస్తూ ఉంటాడా ..?అనే విషయాలపై ఎక్కువగా ఆరా తీయడం మొదలుపెట్టారు జనాలు. అంతేకాదు ఇతగాడు ఓ టాప్ బిజినెస్ మ్యాన్ అంటూ తెలుస్తుంది. మంచి ఆస్తి కలిగిన వ్యక్తి అంటూ ప్రచారం కూడా చేస్తున్నారు. మరి ముఖ్యంగా వీళ్లది లవ్ మ్యారేజ్ అంటూ సోషల్ మీడియాలో బాగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే శ్రీ లలిత కాబోయే భర్త గురించి పూర్తి డీటెయిల్స్ ఆమె వివరించకపోవడం గమనార్హం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news