Moviesవేణు స్వామి చెప్పిన ఆ మెగా లేడీ ఈమె నా..? ...

వేణు స్వామి చెప్పిన ఆ మెగా లేడీ ఈమె నా..? వరుణ్ – లావణ్యలను విడగొట్టడానికి అలా ట్రై చేస్తుందా..?

వేణు స్వామి .. ఈ మధ్యకాలంలో ఒక రాజకీయ నాయకుడు.. ఒక పాన్ ఇండియా స్టార్ట్ .. ఒక టాప్ సెలబ్రిటీ పేర్ల కన్నా కూడా వేణు స్వామి పేరే ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . దానికి కారణం కూడా మనకు తెలిసిందే. వేణు స్వామి టాప్ సెలబ్రిటీస్ జీవితాలకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు బయట పెట్టేస్తూ ఉంటాడు. ఓపెన్ గా అన్ని విషయాలు చెప్పేస్తుండడంతో కొంతమంది స్టార్ సెలబ్రిటీస్ ఫ్యాన్స్ వేణు స్వామి పై మండిపడుతూ ఉంటారు . తాజాగా సోషల్ మీడియాలో వేణు స్వామికి సంబంధించిన న్యూస్ బాగా వైరల్ గా మారింది.

గతంలో వేణు స్వామి ..వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠిలపై ఎలాంటి కామెంట్స్ చేశారో మనకు తెలిసిందే. వాళ్ళిద్దరి జాతకాలు అస్సలు కుదరలేదు అని.. వాళ్ళ వివాహం అసలు కలిసి రాదు అని .. వాళ్ళు విడాకులు తీసుకోవడం పక్క అని .. వాళ్ళ జాతకంలో గురుడు శుక్రుడు నీచ స్థితిలో ఉన్నారు అని .. వాళ్ళకి ఏ మాత్రం అసలు కలవదు అని .. ఆయన ప్రేమ అనే మత్తులో పెళ్లి చేసుకున్నారు అని.. వాళ్ళు విడిపోవడం ఖచ్చితంగా ఖాయమంటూ చెప్పుకు వచ్చారు.

అంతేకాదు వాళ్ళ విడాకులకు ఓ మెగా లేడీ కారణమవుతుంది అంటూ కూడా చెప్పుకు వచ్చారు . అయితే ఇప్పుడు ఎవరా మెగా లేడీ అనే విషయం సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కొంతమంది ఆ మెగా లేడీ నిహారిక అంటూ ట్రోల్ చేస్తున్నారు . నిహారిక వల్లే వరుణ్ లావణ్య విడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది అని.. మిగతా వాళ్లతో పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు అని .. ఆల్రెడీ నిహారిక భర్తకు విడాకులు ఇచ్చేసి సింగల్ గా ఉంటుంది అని.. ఇక మెగా ఫ్యామిలీ నుంచి గొడవలు వస్తే వరుణ్ లావణ్య మధ్యలో నిహారిక వల్ల మాత్రమే రావాలి అని చెప్పుకొస్తున్నారు .

అయితే నిహారిక అభిమానులు మాత్రం దీనిపై మండిపడుతున్నారు . ఆయన ఏదో పని లేక చెప్పాడు.. మీరేదో పనికిమాలిన కామెంట్స్ చేస్తున్నారు ..నిహారిక తన కాళ్లపై తాను నిల్చోవాలని చూస్తుంది . ఇక నోరు మూయండి అంటూ ఘాటుగా సమాధానం చెబుతున్నారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news