MoviesNBK108 లో బాలయ్య రోల్ ఇదే.. అనిల్ రావిపూడి ధింకింగ్ ...

NBK108 లో బాలయ్య రోల్ ఇదే.. అనిల్ రావిపూడి ధింకింగ్ కి రికార్డులు బ్రేక్ అవ్వాల్సిందే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి బాలయ్యకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి ఓ చెరగని స్థానాన్ని క్రియేట్ చేసుకున్నారు బాలయ్య. రీసెంట్గా బాలకృష్ణ నటించిన సినిమా వీరసింహారెడ్డి . ఎటువంటి ఎక్ష్పెక్టేషన్స్ లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఎంత దుమ్ము దులిపేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా నందమూరి బాలయ్య కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

బాలయ్య నెక్స్ట్ చేస్తున్న సినిమా ఎన్బికె 108 . అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్, శ్రియ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీలీల కీలక పాత్రలో కనిపించబోతుంది . ఈ సినిమాకి సంబంధించిన క్రేజీ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఇన్నాళ్లు బాలయ్యను మనం రకరకాల పాత్రలో చూసాం . కానీ ఈ సినిమాలో బాలయ్య చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడట . అంతేకాదు ఈ సినిమాల్లో బాలయ్య ఓ డ్రైవర్గా మనలను మెప్పించబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

ఈ సినిమాలో బాలయ్య పాత్ర చాలా నాచురల్ గా ఉంటుంది అంటూ చెప్పుకొస్తున్నారు సినీ ప్రముఖులు . అంతేకాదు అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాలా కీలక పాయింట్స్ ఉన్నాయని ..నేటి సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఈ సినిమాలో క్లియర్గా చూపించబోతున్నాడు అనిల్. అంతేకాదు బాలకృష్ణ – శ్రీలీల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా ఉండబోతున్నాయట . దీంతో సినిమా ఎప్పుడు ఎప్పుడు చూద్దామా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news