Moviesపుష్ప2 ఫస్ట్ సింగిల్ ప్రోమో రివ్యూ: ఆ ఒక్కటి నమ్ముకుంటే సంకనాకిపోవాల్సిందేనా..?...

పుష్ప2 ఫస్ట్ సింగిల్ ప్రోమో రివ్యూ: ఆ ఒక్కటి నమ్ముకుంటే సంకనాకిపోవాల్సిందేనా..? ఇక మేలుకో సుకుమార్..!

తాను ఒకటి తలిస్తే.. దైవం మరొకటి తలచింది అని.. మన ఇంట్లోని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. మరి ముఖ్యంగా మనం ఏదైనా అనుకున్నప్పుడు అది జరగకుండా దానికి ఆపోజిట్ లో జరిగితే ఆ బాధ వర్ణాతీతం . అస్సలు చెప్పలేము ఆ ఫీలింగ్. ఇప్పుడు అలాంటి బాధను ఫేస్ చేయాల్సి వస్తుంది అల్లు అర్జున్ . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ కి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

అల్లు అర్జున్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా పుష్ప2. ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డారో మనకు తెలిసిందే. స్పెషల్ డైట్ ని కూడా ఫాలో అయ్యారు . రాత్రి పగలు తేడా లేకుండా సినిమా కోసం ప్రాణం పెట్టి నటించాడు . తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ అయింది . ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాడు దేవిశ్రీప్రసాద్.

పుష్ప 1 సినిమాలో దేవి ఎలాంటి మ్యూజిక్ ఇచ్చాడో మనకు తెలుసు. సినిమా హిట్ అవ్వడానికి ఆ మ్యూజిక్ కూడా ఒక కారణం అని చెప్పాలి . అయితే పుష్ప 2 లో మాత్రం ఆ మ్యాజిక్ మిస్సయింది అంటున్నారు. పుష్ప పుష్ప అంటూ సాగే పాట అభిమానులు అంచనాలను అందుకోలేకపోయింది. మరీ ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ బీట్ చప్పగా ఉంది అంటున్నారు . మేము ఏదో ఊహించుకుంటే పుష్పరాజ్ విషయంలో మరోలా జరిగేలా ఉందే అంటూ బాధ పడిపోతున్నారు . అంతేకాదు నువ్వు పుష్ప1 దృష్టిలో పెట్టుకొని ప్రతిదీ ముందుకు తీసుకెళ్తే చాలా కష్టం సుకుమార్ మేల్కో అంటూ సజెషన్స్ ఇస్తున్నారు. చూద్దాం మరి సుకుమార్ అలాంటి నిర్ణయం తీసుకుంటాడో..???

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news