Moviesఅయ్యయ్యో..మళ్ళీ టంగ్ స్లిప్ అయిన నాగచైతన్య.. ఆడేసుకుంటున్న సమంత ఫ్యాన్స్..!!

అయ్యయ్యో..మళ్ళీ టంగ్ స్లిప్ అయిన నాగచైతన్య.. ఆడేసుకుంటున్న సమంత ఫ్యాన్స్..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో స్టార్ కపుల్ గా పేరు సంపాదించుకున్న నాగచైతన్య – సమంతల పేర్లు ఏ రేంజ్ లో మారుమ్రోగి పోతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో వీళ్ళ జంట సూపర్ హాట్ కపుల్ గా పేరు సంపాదించుకుంది . అయితే ఈ జంటకు ఏ దిష్టి తగిలిందో తెలియదు కానీ పట్టుమంటు పది కాలాలపాటు కాపురం చేసుకోకుండానే విడాకులు తీసుకున్నారు . అంతే కాదు వీళ్ళు విడాకులు తీసుకున్న దానికి కారణం కూడా రీసెంట్గా నాగచైతన్య చెప్పుకొచ్చారు.

“సోషల్ మీడియాలో వచ్చిన ఊహాగానాల వల్ల మేము విడాకులు తీసుకున్నామంటూ ” క్లారిటీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో మరోసారి నాగచైతన్య – సమంతల పేర్లు వైరల్ అవుతున్నాయి . కాగా “కస్టడీ” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్యకు..” మీకు హీరోయిన్స్ లో ఎవ్వరు ఎవరిలో ఏది నచ్చుతుంది ” అంటూ అడిగారు హోస్ట్. ఈ క్రమంలోనే నాగ చైతన్య ఓపెన్ గా ఆన్సర్ ఇచ్చాడు.

” పూజ హెగ్డేలో స్టైల్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చిన నాగచైతన్య ..సమంతలో తన హార్డ్ వర్క్ అంటే ఇష్టం అని చెప్పకు వచ్చాడు.. అంతేకాదు కృత్తి శెట్టిలో ఇన్నోసెంట్.. డీసెన్సీ అంటే చాలా ఇష్టం “అంటూ చెప్పుకొచ్చారు . కాగా ఇలా విడాకులు ఇచ్చిన తర్వాత కూడా సమంతను ఓ రేంజ్ లో పొగిడేస్తూ ఉండడం అభిమానులకు ఆశ్చర్యకరంగా ఉంది . అంతేకాదు “సినిమాల ప్రమోషన్ టైం లోనే సమంతను పోగొట్టేస్తావా ..? చైతన్య” అంటూ ఓపెన్ గానే అడిగేస్తున్నారు సమంత ఫ్యాన్స్. దీనికి నాగచైతన్య సమాధానం ఏమి ఇస్తాడు చూద్దాం..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news