Moviesచిన్న రీజన్ తో చేతుల్లారా కస్టడీలో "కృతిశెట్టి" పాత్ర వదులుకున్న స్టార్...

చిన్న రీజన్ తో చేతుల్లారా కస్టడీలో “కృతిశెట్టి” పాత్ర వదులుకున్న స్టార్ హీరోయిన్ ఈమె.. నాగ చైతన్య భళే హ్యాపీగా ఫీల్ అయ్యాడట..!!

టాలీవుడ్ యంగ్ హీరోగా పేరు సంపాదించుకున్న నాగచైతన్య లేటెస్ట్ గా నటించిన చిత్రం “కస్టడి” . మే 12న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ -ఫ్యామిలీ -లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ అభిమానులకు తెగ నచ్చేసింది . ఈ ట్రైలర్ ఆధారంగా చైతన్య మరో హిట్ తన ఖాతాలో వేసుకోవడం పక్కా అంటూ జనాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు .

అంతేకాదు ఈ సినిమాల్లో రిలీజ్ అయిన లుక్స్ ..ట్రైలర్ ఆధారంగా చూసుకుంటే నాగచైతన్య డిఫరెంట్ కంటెంట్ చూస్ చేసుకున్నట్లు తెలుస్తుంది . కాగా ఈ సినిమాలో రెండోసారి కృతి శెట్టితో రొమాన్స్ చేయబోతున్నాడు నాగచైతన్య . నిజానికి ఈ రేవతి పాత్ర అనుకున్నప్పుడు డైరెక్టర్ మదిలో తట్టిన హీరోయిన్ రష్మిక మందన ఆట . ఇదే విషయాన్ని డైరెక్టర్ ఆమెకి చెప్పారట . కానీ స్టోరీ స్క్రీన్ స్పేష్ తక్కువగా ఉందని.. అప్పటికే పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న రష్మిక మందన ..ఈ పాత్రని రిజెక్ట్ చేసిందట .

ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు హీరోయిన్ లు అనుకున్న సరే నాగచైతన్య.. ఈ పాత్రకి కృతిశెట్టి బాగుంటుందని ..ఏరి కోరి మరి సెలెక్ట్ చేసుకున్నాడు. కృతి పాత్రను ఓకే చేయగానే నాగ చైతన్య భళే హ్యాపీగా ఫీల్ అయ్యాడట. నాగచైతన్య సెలక్షన్ సూపర్ ఈ పాత్రకు కృతి శెట్టి తప్పిస్తే మరి ఎవరు సూట్ అయ్యేవారు కాదు అంటున్నారు జనాలు. చూద్దాం రేవతి పాత్రలో కృటి శెట్టి ఎలాంటి హిట్ తన ఖాతాలో వేసుకోబోతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news