Moviesమ‌హేష్ ఇండియాకు వ‌చ్చాడు… వెంట‌నే త్రివిక్ర‌మ్‌కు పెద్ద షాక్ ఇచ్చాడు…!

మ‌హేష్ ఇండియాకు వ‌చ్చాడు… వెంట‌నే త్రివిక్ర‌మ్‌కు పెద్ద షాక్ ఇచ్చాడు…!

మ‌హేష్‌బాబు – త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ సినిమా ఒక అడుగు ముందుకు… మూడు అడుగులు వెన‌క్కు అన్న చందంగా ఉంది. అస‌లు ఏ ముహూర్తాన ఈ సినిమా ప‌ట్టాలు ఎక్కిందో కాని.. ఎప్ప‌ట‌కీ పూర్త‌వుతుందో ? ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియ‌ట్లేదు. ఇప్ప‌టికే రెండు షెడ్యూల్స్ పూర్త‌య్యాయి అంటున్నా అస‌లు ఆ ఫుటేజ్ కూడా స‌రిగా రాలేద‌ని అంటున్నారు.

ఇక తాజాగా మ‌హేష్ మరో విదేశీ పర్యటన పూర్తిచేసుకుని హైద‌రాబాద్‌కు వ‌చ్చాడు. ఇంకేముందు ఇక ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైపోతుంద‌ని మ‌హేష్ అభిమానులు ఆశ‌ల‌తో ఉన్నారు. పైగా సూప‌ర్‌స్టార్ కృష్ణ జ‌యంతి సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్‌, లుక్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేస్తుంద‌ని ఒక్క‌టే ఆశ‌ల ప‌ల్ల‌కీలో ఉన్నారు.

ఇక టైటిల్‌గా అమరావతికి అటుఇటు, గుంటూరు కారం, ఊరికి మొనగాడు లాంటి పేర్లు వైర‌ల్ అవుతున్నాయి. వీరి ఆశ‌లు ఎలా ఉన్నా మ‌హేష్ ఇండియాకు అలా వ‌చ్చాడో లేదో వెంట‌నే త్రివిక్ర‌మ్‌కు షాక్ ఇచ్చేశాడంటున్నారు. మ‌హేష్‌కు కొన్ని క‌మిట్‌మెంట్స్‌తో పాటు కొన్ని ప‌నులు ఉన్నాయ‌ట‌. అవి చాలా ముఖ్యం అని తెలుస్తోంది.

ఆ ప‌నులు అన్నీ పూర్త‌య్యాక కానీ మ‌హేష్ సినిమా సెట్‌లోకి రాడ‌ని తెలుస్తోంది. అదే జ‌రిగితే మ‌రో రెండు వారాల పాటు ఈ సినిమా షూటింగ్ జ‌ర‌గ‌దు. ఆగ‌స్టులో అనుకున్నారు. ఇప్పుడు రిలీజ్ డేట్ ను ఎలాగూ వాయిదావేశారు కాబట్టి త్రివిక్ర‌మ్ కూడా ఎలాగూ నిదానంగా షూటింగ్ చేద్దామ‌ని ఫిక్స్ అయిపోయాడ‌నే అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news