Moviesకావేరి గాలిలా… తాకేసి పోక‌లా… న‌రేష్ - ప‌విత్ర రొమాంటిక్ సాంగ్...

కావేరి గాలిలా… తాకేసి పోక‌లా… న‌రేష్ – ప‌విత్ర రొమాంటిక్ సాంగ్ కేక ( వీడియో )

టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు న‌రేష్‌, ప‌విత్రా లోకేష్ మ‌ధ్య ఎంత య‌వ్వారం న‌డుస్తోందో వీరిద్ద‌రు క‌లిసి తెలుగు మీడియాకు, తెలుగు సోష‌ల్ మీడియాకు ఎంత న్యూస్ ఫీడింగ్ ఇస్తున్నారో చూస్తున్నాం. గ‌త రెండేళ్లుగా వీరిద్ద‌రు ఏం చేసినా మీడియాలో ర‌చ్చ అయిపోతోంది. ఇక న‌రేష్ – ప‌విత్ర పెళ్లిని న‌రేష్ మూడో భార్య ర‌మ్య ర‌ఘుప‌తి ఎంత మాత్రం ఇష్ట‌ప‌డ‌డం లేదు.

ఇక వీరిద్ద‌రు మాత్రం గ‌త కొంత కాలంగా స‌హ‌జీవ‌నం చేస్తూ వ‌స్తున్నారు. విచిత్రం ఏంటంటే వీరిద్ద‌రి స్టోరీ నేప‌థ్యంలోనే టాలీవుడ్ సీనియ‌ర్ నిర్మాత ఎంఎస్‌. రాజు మ‌ళ్లీ పెళ్లి అనే సినిమా నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు న‌రేష్ నిర్మాత కాగా.. ఎంఎస్‌. రాజు ద‌ర్శ‌కుడు. తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా లేటు వ‌య‌స్సులో పెళ్లి అనే కాన్సెఫ్ట్‌తో తెర‌కెక్కుతోంది.

తాజాగా మేక‌ర్స్ ఈ సినిమా నుంచి ఓ రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాట‌కు అనంత శ్రీరామ్ లిరిక్స్ ఇవ్వ‌గా సింగ‌ర్ న‌రేష్ అయ్య‌ర్ ఆల‌పించారు. ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందిచారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్‌, ట్రైల‌ర్ రెండు కూడా సినిమాపై అంచ‌నాలు పెంచేశాయి. ఇక తాజాగా రిలీజ్ అయిన కావేరి గాలిలా… తాకేసి పోక‌లా అన్న రొమాంటిక్ సాంగ్ అయితే న‌రేష్‌, ప‌విత్ర మ‌ధ్య ఉన్న ప్రేమ బంధాన్ని మ‌రింత స్ట్రాంగ్ చేసేలా ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news