Moviesఉపాస‌న బేబీ ష‌వ‌ర్‌… చ‌ర‌ణ్‌తో రొమాన్స్ అదిరిందిగా (వీడియో)

ఉపాస‌న బేబీ ష‌వ‌ర్‌… చ‌ర‌ణ్‌తో రొమాన్స్ అదిరిందిగా (వీడియో)

టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ కపుల్స్ అయినా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన కామినేని జంట ప్రస్తుతం దుబాయ్ వెకేషన్ లో ఉన్నారు. త్వరలోనే వీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. పెళ్లి అయిన తర్వాత 11 ఏళ్లకు వీరు తొలిసారిగా తల్లిదండ్రులు కాబోతున్నారు. దీంతో మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆ ఫ్యామిలీ మెగా అభిమానులు అందరూ ఈ దంపతులకు పుట్టబోయే బిడ్డ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక రాంచరణ్ త్రిబుల్ ఆర్ లాంటి బ్లాక్‌బ‌స్టర్ హిట్ తర్వాత ఒక్కసారిగా పాన్ ఇండియా హీరో అయిపోయాడు.

ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్లో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన 15వ‌ సినిమాలో నటిస్తున్నారు. ఇక దుబాయ్ వెకేషన్ లో ఉన్న రామ్ చరణ్ – ఉపాసన దంపతులు అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. దుబాయ్‌లోని నమోస్‌ బీచ్ క్లబ్లో ఉపాసన బేబీ షవర్ వేడుక చాలా వైభవంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోను ఉపవాసన తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఉపాసన తన ఇన్‌స్టాలో అద్భుతమైన సందేశం పోస్ట్ చేసింది.

మీ అందరి ప్రేమకు చాలా కృతజ్ఞతలు.. నా జీవితంలో బెస్ట్ బేబీ షవర్ ఇచ్చిన నా ప్రియమైన సిస్టర్స్ కు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది. ఈ వేడుకలో రామ్ చరణ్ – ఉపాసన స్నేహితులతో పాటు కజిన్స్ కూడా పాల్గొన్నారు. అలాగే తన భర్త రామ్ చరణ్ పై తనకు ఉన్న అద్భుతమైన ప్రేమను సింపుల్ రోమాన్స్ తో కూడా వ్యక్తం చేసింది. అలాగే ఈ ఫోటోలను ఉపాసన స్నేహితులతో కూడా పంచుకున్నారు.

ఈ వీడియో చూసిన అభిమానులు ఉపాసన – రాంచరణ్ జంటపై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొద్ది రోజులపాటు దుబాయ్ వెకేషన్ ఎంజాయ్ చేసిన తర్వాత ఈ దంపతులు ఇద్దరు తిరిగి ఇండియాకు చేరుకోనన్నారు. ఆ తర్వాత చరణ్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న గేమ్ ఛేంజ‌ర్ సినిమా షూటింగ్లో పాల్గొంటారు. ఈ సినిమా వచ్చే యేడాది రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news