Moviesమ‌హేష్ మేన‌ళ్లుడు రెండో సినిమా గ్లింప్స్‌తోనే నీర‌సాలు తెప్పించాడుగా… (వీడియో)

మ‌హేష్ మేన‌ళ్లుడు రెండో సినిమా గ్లింప్స్‌తోనే నీర‌సాలు తెప్పించాడుగా… (వీడియో)

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబం నుంచి మరో హీరోగా గల్లా అశోక్ వ‌చ్చాడు. ఇటు తాత సూప‌ర్‌స్టార్‌, మేన‌మామ మ‌హేష్ ఈ త‌రం సూప‌ర్‌స్టార్‌. అటు తండ్రి ఎంపీ, బ‌ల‌మైన గ‌ల్లా కుటుండ అండ‌దండ‌లు… పారిశ్రామిక‌వేత్త‌ల కుటుంబంలో మ‌న‌వ‌డు కావ‌డంతో తొలి సినిమా హీరోతో గ్రాండ్‌గా వెండితెర‌పై ఎంట్రీ ఇచ్చాడు. హీరో సినిమా కోసం భారీగానే ఖ‌ర్చు పెట్టారు.

నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌. సినిమాకు అంతా బాగా ఖ‌ర్చుపెట్టినా.. అంద‌రూ క‌ష్ట‌ప‌డినా అనుకున్నంత ఫ‌లితం రాలేదు. ఇక ఇప్పుడు లాంగ్ గ్యాప్ తీసుకుని త‌న రెండో సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సారి త‌న ఫ‌స్ట్ సినిమాకు భిన్నంగా మాస్ ట్రీట్‌తో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సాలిడ్ మాస్ సినిమాగా తెరకెక్కుతోంది. ఇక ఈ రోజు మ‌హేష్‌బాబు చేతుల మీదుగా రిలీజ్ చేసిన గ్లింప్స్ లో అశోక్ గల్లా కంప్లీట్ కొత్త మేకోవర్ లో మాస్ గా కనిపిస్తున్నాడు. అయితే వీడియోలో అశోక్ లుక్‌, ఆ స్టైల్ అయితే ఏమంత ఆస‌క్తిగా లేదు.

మొత్తానికి గ‌ల్లా అశోక్ రెండో సినిమాతో అయినా మంచి హైప్ తెచ్చుకుంటాడు అనుకుంటే.. గ్లింప్స్‌తోనే నీర‌సాలు తెప్పించేశాడు. ఈ సినిమాకు ప్రముఖ టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కథ అందిస్తున్నాడు. భీమ్స్ సంగీతం అందిస్తుండగా శ్రీ లలితాంబిక ప్రొడక్షన్స్ వారు నిర్మాత‌లు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news