Moviesత‌న‌కంటే చిన్నోడు.. ఆ స్టార్ హీరో కొడుకుతో బేబ‌మ్మ రొమాన్స్‌…!

త‌న‌కంటే చిన్నోడు.. ఆ స్టార్ హీరో కొడుకుతో బేబ‌మ్మ రొమాన్స్‌…!

తెలుగు సినిమా ఉప్పెన పేరుకు తగ్గట్టే ఉప్పెన లాంటి విజయాన్ని సొంతం చేసుకుంది. కొత్త దర్శకుడు కొత్త హీరో.. కొత్త హీరోయిన్ అయినా కూడా సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. వర్ధమాన నటుడు వైష్ణవ తేజ్ ఈ సినిమాతోనే టాలీవుడ్‌కు హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాతోనే కన్నడ కస్తూరి కృతి శెట్టి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. కోలీవుడ్ క్రేజీ హీరో విజయ్ సేతుపతి విలన్ గా నటించిన ఈ సినిమాతో సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకుడుగా పరిచయం అయ్యారు.

మైత్రి మూవీస్ లాంటి పెద్ద బ్యానర్ నిర్మించిన ఈ సినిమా సంచలనాత్మక విజయం సాధించింది. ఒక కొత్త హీరో సినిమా రు. 100 కోట్ల వ‌సూళ్లు సాధించడం అంటే ఎంత సంచలనమో చెప్పక్కర్లేదు. ఈ సినిమాని కోలీవుడ్లో రీమిక్స్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ వారసుడు సంజయ్ హీరోగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. సంజయ్ ఇప్పటికే బాల‌న‌టుడుగా కొన్ని సినిమాలలో నటించారు. ప్రస్తుతం దర్శకత్వంపై మక్కువ చూపుతున్నట్టు తెలుస్తోంది.

విదేశాలలో దర్శకత్వ శాఖలో శిక్షణ పొందిన సంజయ్ ఇప్పటికే షార్ట్ ఫిలిమ్స్ కూడా రూపొందిస్తున్నారు. త్వరలోనే ఓ సినిమాకు దర్శకత్వం వహించే ప్రయత్నంలో ఉన్నట్టు కూడా సమాచారం. ఇలాంటి పరిస్థితులలో ఓ ప్రముఖ నిర్మాత ఉప్పెన రీమేక్ లో సంజయ్ ని హీరోగా నటింపజేయాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఉప్పెన తెలుగు వెర్ష‌న్‌లో హీరోయిన్గా నటించిన కృతి శెట్టినే తమిళంలోనూ హీరోయిన్గా తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది.

కృతి శెట్టి ఇప్పటికే కోలీవుడ్లో ది వారియర్ సినిమాలో నటించి పరిచయం అయ్యారు. అలాగే నాగచైతన్య నటిస్తున్న ద్విభాషా సినిమా కస్టడీలోను ఆమె హీరోయిన్. ఇక ఉప్పెన సినిమాలో తనకంటే చిన్నోడు స్టార్ హీరో విజయ్ కొడుకు సంజయ్ తో కృతి శెట్టి రోమాన్స్ అంటే కచ్చితంగా హాట్‌ టాపిక్ గానే ఉంటుంది. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news