Moviesకోలీవుడ్ హీరో రజనీకాంత్ భార్య ఆ టైపా..? సంచలన వీడియో వైరల్..!!

కోలీవుడ్ హీరో రజనీకాంత్ భార్య ఆ టైపా..? సంచలన వీడియో వైరల్..!!

కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా కానీ.. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే ప్రతి ఒక్కరు పడి చచ్చిపోతూ ఉంటారు . రీజన్ ఏంటో తెలియదు కానీ ఇప్పటికి రజనీకాంత్ అంటే జనాల్లో పిచ్చ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది . కేవలం తమిళ్లోనే కాకుండా తెలుగులోనూ తనదైన స్టైల్ లో సినిమాలు చేసి గుర్తింపు సంపాదించుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్.. ప్రెసెంట్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు . మంచి కంటెంట్ ఉన్న సినిమాల్లోనే నటిస్తున్నాడు .

రజనీకాంత్ ఫ్యామిలీ కి సంబంధించిన వీడియో ప్రజెంట్ వైరల్ గా మారింది . రజినీకాంత్ ఈ వీడియోలో తమిళంలో మాట్లాడారు. రజనీకాంత్ మాట్లాడిన మాటలు ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి . “ఆయన మాట్లాడుతూ నేను షూటింగ్ అయిపోయిందంటే .. చాలా విపరీతంగా మద్యపానం చేస్తాను.. ఫుల్ బాటిల్ తాగేస్తాను.. అంతేకాదు అప్పట్లో ఎన్ని సిగరెట్లు డబ్బాలు డబ్బాలు కాలుస్తానో నాకే తెలియదు .. అంతేనా ఆ ముక్కలేనిదే ముద్ద దిగదు .. కచ్చితంగా నేను తినే రెండుసార్లు మటన్ లేదా చికెన్ ఉండి తీరాల్సిందే”.

” లేకపోతే గోల గోల చేసేస్తాను .ఇన్ని దుర అలవాట్లు ఉన్న నేను ఇప్పటికీ బ్రతికే ఉన్నాను .. హెల్తీగా ఉన్నాను అంటే దానికి కారణం నా భార్య నన్ను ఇంత హెల్తీగా తయారు చేసింది .. నా వ్యసనాల నుండి నన్ను బయటపడేలా చేసింది. నా భార్య క్యారెక్టర్ అది ..నేను లేకపోతే ఆమె లేదు. పైకి గంభీరంగా కనిపించినా ఆమె మనసు చాలా సున్నితమైనది ” అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు . అంతేకాదు నేను ప్రాణాలతో ఉన్నాను అంటే దానికి కారణం నా భార్య అంటూ టోటల్ క్రెడిట్ రజనీకాంత్ భార్యకు ఇచ్చేశాడు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news