Moviesప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జోడీగా డిజాస్ట‌ర్ హీరోయిన్‌… బాబోయ్ అంటూ భ‌య‌ప‌డుతోన్న ఫ్యాన్స్‌…!

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జోడీగా డిజాస్ట‌ర్ హీరోయిన్‌… బాబోయ్ అంటూ భ‌య‌ప‌డుతోన్న ఫ్యాన్స్‌…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. పవన్ ప్రస్తుతం క్రిష్‌ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాతో పాటు సముద్రఖని దర్శకత్వంలో తన మేనల్లుడు సాయితేజతో కలిసి వినోదయ సితం సినిమా రీమేక్‌ లో కూడా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ పార్ట్ షూటింగ్ కూడా పూర్తయింది. హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కు జోడిగా నిధి అగర్వాల్ – బాలీవుడ్ బ్యూటీ జాక్వెలైన్ ఫెర్నాండెజ్ నటిస్తున్నారు.

ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కి జోడిగా నటించే ఛాన్స్ ని టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల సొంతం చేసుకుంది. ఓవైపు మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్న ఆమె ఇటు పవన్ కు జోడిగా ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమాలో నటించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం.

ఈ మూడు సినిమాల సంగ‌తి ఇలా ఉంటే ఇప్పుడు ప‌వ‌న్ సాహో డైరెక్ట‌ర్ సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమాకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అన్న ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ కోసం కోలీవుడ్ బ్యూటీ ప్రియాంకా ఆరుళ్ మోహన్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఆమె ఇప్ప‌టికే తెలుగులో రెండు సినిమాలు చేసింది.

నేచుర‌ల్ స్టార్ నానికీ జోడీగా గ్యాంగ్ లీడర్ – శర్వానంద్ తో శ్రీకారం సినిమాలలో నటించింది. ఈ రెండు సినిమాలు కూడా బిగ్గెస్ట్‌ డిజాస్టర్ అయ్యాయి. ఇప్పుడు ఏకంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో న‌టించే ఛాన్స్ కొట్టేసింది. అయితే ప‌వ‌న్ ఫ్యాన్స్ మాత్రం ఈ డిజాస్ట‌ర్ హీరోయిన్ త‌ప్పా మీకు ఇంకెవ్వ‌రు దొర‌క‌లేదా ? అని ర‌చ్చ లేపుతున్నారు. స్టార్ ఇమేజ్ లేని హీరోయిన్ల‌ను మా హీరోకు జోడీగా ఎందుకు పెడ‌తారు అంటూ ఫైర్ అవుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news