Moviesసిల్క్ స్మిత జీవితాన్నే సంక నాకించేసింది ఆ ఒక్క సినిమానేనా..? ఎంత...

సిల్క్ స్మిత జీవితాన్నే సంక నాకించేసింది ఆ ఒక్క సినిమానేనా..? ఎంత దారుణం అంటే..?

సిల్క్ స్మిత .. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ..ఆమె నటించిన సినిమాల ద్వారా ఇంకా మన మధ్యలో జీవిస్తూనే ఉంది అంటూ జనాలు నమ్ముతూ ఉంటారు . సిల్క్ స్మిత ఎంతమంది అబ్బాయిల కలల రాకుమారి అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అప్పట్లో ఎంతో మంది స్టార్ సీనియర్ హీరోయిన్స్ ఉన్న కానీ అందరూ సిల్క్ స్మిత పేరునే జపించేవారు .. అంటే అమ్మడు క్రేజ్ ఎంతలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

అయితే ఎవరు ఊహించిన విధంగా ఆమె జీవితం అర్ధాంతరంగా మధ్యలోనే ఆగిపోవడం బాధాకరమని చెప్పాలి . ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని.. ఉన్నత స్థాయికి చేరుకోవాలని కష్టపడి ఇష్టపడిన స్మిత ఇలా చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం బాధాకరం. ఇప్పటికే ఆమె మరణం ఓ మిస్టరీ గానే ఉంది. సిల్క్ స్మిత ఆర్థికంగా బాగా చితికి పోవడానికి కారణం అదే అంటూ కాకినాడ శ్యామల సంచలన కామెంట్స్ చేసింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా.. ప్రొడ్యూసర్ గా.. ఫైనాన్షియల్ గా .. తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న.. కాకినాడ శ్యామల.. దాదాపు 200 సినిమాలకు పైగానే నటించింది .

ఈ క్రమంలోనే ఎన్నో చిత్రాలలో నటించి విజయాలను అందుకున్న ఈమె .. ఈ మధ్యకాలంలో వరుసగా యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ .. తనదైన స్టైల్ లో రాణిస్తుంది . మరి ముఖ్యంగా సిల్క్ స్మిత జీవితం పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . “ఆమె చాలా మంచిదని.. కొందరు ఆమెను డబ్బు కోసం వాడుకున్నారని” చెప్పుకు రావడం హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది.

మరీ ముఖ్యంగా ఆమె జీవితం నాశనం అయిపోవడానికి కారణం ఆమె తీసుకున్న తప్పుడు డెసిషన్సే అని ..మంచి మూవీస్ వస్తున్నా కానీ సిల్క్ స్మిత ఫ్రెండ్షిప్ అంటూ నమ్మిన డైరెక్టర్స్ కి కాల్ షీట్స్ ఇచ్చి డబ్బు లు లేకుండానే సినిమాలు చేసి లాస్ అయ్యిందని, మరికొందరు ఆమెను నమ్మించి ముంచేసారని..ఇలా తన జీవితం నాశనం చేసుకుందని అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇప్పటికి సిల్క్ స్మిత పేరుని జపిస్తూనే ఉన్నారు జనాలు. నిన్నకాక మొన్న రిలీజ్ అయ్యి 100 కోట్ల క్లబ్ లోకి చేరిన దసరా సినిమాలోని సిల్క్ స్మిత ఫోటో పెట్టి సినిమా కు ఆమె క్రేజ్ ని వాడుకున్నారంటే … ఆమె రేంజ్ ఎలాంటిది అర్థం చేసుకోవచ్చు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news