Newsకె. విశ్వ‌నాథ్‌కు.. హీరో కృష్ణ‌కు అక్క‌డే గొడ‌వ మొద‌లైంది..!

కె. విశ్వ‌నాథ్‌కు.. హీరో కృష్ణ‌కు అక్క‌డే గొడ‌వ మొద‌లైంది..!

మ‌హా ద‌ర్వ‌కుడు విశ్వ‌నాథ్ సినీ ఇండ‌స్ట్రీలో అజాత శ‌త్రువు. అయితే.. ఆయ‌న‌తో హీరో కృష్ణ సినిమాలు చేయ‌లేదు. దీనికి కార‌ణం.. విశ్వ‌నాథ్‌పై కృష్ణ‌కు కోపం. అంతేకాదు.. విశ్వ‌నాథ్ నిర్మాత‌ల‌తోనూ సినిమాలు చేయ‌న‌ని చెప్పేసిన ఘ‌నత‌.. అలానే నిల‌బ‌డిన ఘ‌న‌త కూడా కృష్ణ‌దే. దీనికి పెద్ద కార‌ణ‌మే ఉంది. ఏంటంటే.

వివసువు అనే కథ ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రం ‘సిరిమల్లె నవ్వింది’. దీనిని అప్ప‌టి దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఆదుర్తి సుబ్బారావు గారి అబ్బాయి తీయాల‌ని అనుకున్నారు. దీనికి విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తే బాగుంటుంద‌ని అనుకున్నారు. కానీ, ఆయ‌న ఒప్పుకోలేదు. నిజానికి విశ్వ‌నాథ్ సుబ్బారావు శిష్యుడే. ఇక‌, కృష్ణకు లైఫ్ ఇచ్చింది కూడా ఆదుర్తి సుబ్బారావు. ఆయ‌న ఆకస్మిక మరణంతో ఆయన కుటుంబం ఇబ్బందుల్లో పడింది.

ఆ సమయంలో హీరో కృష్ణ ఆ కుటుంబానికి కొండంత అండగా నిలిచి వారి బాగోగులు పర్యవేక్షించేవారు. కొన్ని సినిమాలు చేసి పెట్టారు. అయినా ఆయన్ని పదే పదే ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, ఇక చిత్ర నిర్మాణం ఆపేసి, స్వగ్రామానికి తిరిగి వెళ్లిపోవాలని ఆదుర్తి కుటుంబ సభ్యులు నిర్ణయించుకొన్నారు. ఈ విషయం హీరో కృష్ణకు తెలిసింది. నేనున్నానని ధైర్యం చెప్పి చిత్ర నిర్మాణం కొనసాగించమన్నారు.

ఆదుర్తి సుబ్బారావు శిష్యుడు, దర్శకుడిగా ప్రముఖ స్థానంలో ఉన్న కే. విశ్వనాధ్ దగ్గరకు వెళ్ళి సినిమా చేయమని అడిగారు ఆదుర్తి కుటుంబ సభ్యులు. కానీ, ఆయన సానుకూలంగా స్పందించలేదు. వాళ్ల తరపున హీరో కృష్ణ కూడా వెళ్లి విశ్వనాధ్‪ని అడిగారు. ‘వాళ్ళు మీకు పారితోషికం ఇవ్వలేరేమోనని సందేహించకండి.. నాది బాధ్యత..’ అని కూడా చెప్పారు. అయినా విశ్వనాధ్ ఎందుకో ముందుకు రాలేదు.

అప్పుడు విజయనిర్మల దర్శకత్వంలో ‘సిరిమల్లె నవ్వింది’ చిత్రాన్ని తీయించారు కృష్ణ. హీరో కృష్ణ సరసన సుజాత నటించిన ఏకైక చిత్రం ఇదే. ఇది సూప‌ర్ హిట్ అయింది. అంతే.. ఆదుర్తి కుటుంబం ఆర్థికంగా పుంజుకుంది. ఇక‌, అప్ప‌టి నుంచి విశ్వ‌నాథ్‌ను కృష్ణ ప‌క్క‌న పెట్టేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news