Moviesఆ హీరో కొడుకుతోనే సినిమా ఎంట్రీ.. సెన్సేషనల్ విషయాన్ని బయటపెట్టిన మహేష్...

ఆ హీరో కొడుకుతోనే సినిమా ఎంట్రీ.. సెన్సేషనల్ విషయాన్ని బయటపెట్టిన మహేష్ బాబు కూతురు సితార..!

ఎస్ ప్రజెంట్ ఇప్పుడు ఇదే న్యూస్ నెట్టింట బాగా బాగా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్నాడో మనకు తెలిసిందే. త్వరలోనే రాజమౌళితో తెరకెక్కే సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు . కాగా ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు కూతురు సితార ఒక సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతుంది అన్న వార్త వైరల్ గా మారింది . అఫ్కోర్స్ మహేష్ బాబు నమ్రతా తన కూతురు హీరోయిన్ ఎంట్రీ విషయాన్ని అన్ అఫీషియల్ గా కన్ఫామ్ చేసేసారు . తను మంచి ఛాన్స్ వచ్చినప్పుడు ఇండస్ట్రీలోకి వస్తుంది అని.. తన కోరిక ప్రకారం ఏదైనా చేస్తాము అని.. ఓపెన్ గానే చెప్పుకొచ్చారు .

అయితే తాజాగా ఘట్టమనేని వారసురాలు ఓ ఇంటర్వ్యూలో సరదా సరదాగా పాల్గొనింది . ఆ ఇంటర్వ్యూలో జనాలకు తెలియని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను కూడా చెప్పుకొచ్చింది . సితార అన్నను ఆటపట్టించడం అంటే మహా మహా ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది. అన్న నుంచి ఓపిగ్గా ఎలా ఉండాలో నేర్చుకున్నాను అంటూ కూడా తెలిపింది. అంతేకాదు తల్లి నుంచి ఫ్యాషన్ సెన్స్.. తండ్రి నుంచి యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకున్నాను అంటూ చెప్పింది . ఖలేజా సినిమాలోని సీతారామరాజు పాత్ర లాంటి రోల్ చేయాలని ఉంది అని తన మనసులోని కోరికను బయటపెట్టింది . అంతేకాదు మహేష్ మంజుల క్యూట్ మూమెంట్ హెయిర్ గురించి కూడా సరదాగా చెప్పుకొచ్చింది.

” నాన్నకు తన హెయిర్ అంటే చాలా చాలా ఇష్టమని అందుకే అంత టచ్ చేయగానే వద్దు అని చెప్పేసాడు అని చెప్పుకొచ్చింది”. అంతేకాదు అనఫీషియల్గా తన సినిమా హీరోయిన్ ఎంట్రీ గురించి కూడా కన్ఫర్మ్ చేసింది . అయితే దానికి ఇంకా సమయం ఉంది అంటూ కూడా చెప్పుకొచ్చింది . గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్.. హీరోగా సితార హీరోయిన్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు భారీ కాన్సెప్ట్ తో అద్దిరిపోయే సినిమాను తెరకెక్కించబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. బహుశా సితార మాటలు వింటుంటే అది నిజమేమో అంటున్నారు అభిమానులు . చూద్దాం మరి దీనిపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news