Moviesస్క్రీన్ పై సమంత తో రొమాంటిక్ సీన్ రాగానే .. నాగ...

స్క్రీన్ పై సమంత తో రొమాంటిక్ సీన్ రాగానే .. నాగ చైతన్య ఏం చేశాడో చూడండి.. మహా నాటీనే..!!

సమంత – నాగచైతన్య.. ఈ పేర్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తమకంటూ ఓ స్పెషల్ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నారు . ఇద్దరూ ఇద్దరే ఎవరి నటనలో వాళ్ళు టాలెంటెడ్ ..ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కొన్ని మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు. అయితే వీళ్ళు ప్రేమించుకునే టైంలోనే వీళ్ళు ప్రేమలో ఉన్నారు అన్న విషయాన్ని పరోక్షంగా అభిమానులకి తెలియజేస్తూనే వచ్చారు. మరి ముఖ్యంగా అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి నటించిన సినిమా మనం .

ఈ సినిమాలో హీరోయిన్గా సమంత – శ్రేయ శరణ్ నటించారు. సమంత-చైతన్య ఈ సినిమాలో భార్యాభర్తలు గా కనిపిస్తారు . ఈ సినిమా రిలీజ్ అయి పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే సినిమా థియేటర్స్ లో మళ్ళీ స్పెషల్ షోస్ వేశారు . అక్కినేని ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కాగా డైరెక్టర్ విక్రమ్ దర్శకత్వంలో పునర్జన్మల ప్రేమను మిక్స్ చేస్తూ వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారు నాగార్జున – నాగచైతన్య – అమల – అఖిల్ – సమంత – శ్రేయ కీలక పాత్రలు పోషించారు .

ఈ సినిమా రిలీజ్ అయి పదేళ్లు పూర్తయిన సందర్భంగా సినిమాను రీ రిలీజ్ చేశారు . అభిమానులతో ఈ సినిమాను చూశాడు అక్కినేని నాగచైతన్య . ఈ క్రమంలోనే చైతు అభిమానులు డైరెక్టర్ విక్రమ్ తో కలిసి రచ్చరంబోలా చేశారు . మరీ ముఖ్యంగా స్క్రీన్ పై సమంత చైతన్య పెళ్లి సీన్ రాగానే అరుపులు ఓ రేంజ్ లో ఉన్నాయి . నాగచైతన్య సమంత రొమాంటిక్ సీన్స్ వచ్చినప్పుడైతే గోల గోల గా మారిపోయాయి. మరీ ముఖ్యంగా సమంతతో నాగచైతన్య పెళ్లి సన్నివేశం రాగానే ఫ్యాన్స్ సీట్లలో నుంచి లేచి గంతులేస్తూ అరుస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ జంట బాగా ఉంది అని మళ్ళీ కలిస్తే బాగుంటుంది అని ఫాన్స్ ఆశపడుతున్నారు. కానీ అది చచ్చిన జరగదు అంటూ కొందరు తేల్చి చెప్పేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news