Movies"కల్కి" సినిమాని మిస్ చేసుకున్న దురదృష్టవంతుల హీరోల లిస్ట్ ఇదే.. అందరూ...

“కల్కి” సినిమాని మిస్ చేసుకున్న దురదృష్టవంతుల హీరోల లిస్ట్ ఇదే.. అందరూ ఒకే రీజన్ చెప్పి తప్పించుకున్నారుగా..!

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో కోసం రాసుకున్న కథను మరొక హీరో చేస్తూ ఉండం సర్వసాధారణమైన విషయమే. ఇది మన అందరికీ బాగా తెలుసు . అయితే కొన్ని కొన్ని సార్లు మంచి మంచి సినిమాలను కొందరు స్టార్ హీరోలు మిస్ చేసుకుంటూ ఉంటారు . కారణం ఏమైనప్పటికీ అలా మంచి మంచి సినిమాలు మిస్ చేసుకున్నాక ఆ సినిమా హిట్ అయ్యాక ఆ స్టార్ హీరోల పేర్లు సోషల్ మీడియాలో లీకై వైరల్ అయితే ఫ్యాన్స్ బాధ వర్ణాతీతం. ఇప్పుడు అదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.

ప్రజెంట్ ఇప్పుడు రెబల్ అభిమానులు ఎంతో ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా మూవీ కల్కి 2898 . ఈ సినిమా కోసం ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో ఫాన్స్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్ రామోజీ ఫిలిం సిటీ లో జరిగింది . చాలా గ్రాండ్ గా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్లో ప్రభాస్ తన బుజ్జిని పరిచయం చేశాడు. చాలా స్టైలిష్ గా ట్రెండీగా ప్రభాస్ బుజ్జి ఉండడం సినిమాకి హైలెట్గా మారింది .

అంతేకాదు ఈ సినిమాలో హీరో హీరోయిన్లకు మించిన రేంజ్ లో బుజ్జి పర్ఫామెన్స్ క్యారెక్టర్ ఉండబోతుంది అంటూ కూడా ప్రచారం జరుగుతుంది . అయితే మొదట కల్కి సినిమాను న్సగ్ అశ్వీన్.. ఎన్టీఆర్ తో తెరకేక్కించాలనుకున్నారట . ఎన్టీఆర్ కి కూడా వివరించారట . అయితే కొన్ని కారణాల చేత ఆయన రిజెక్ట్ చేశారట . ఆ తర్వాత రామ్ చరణ్ – మహేష్ బాబు – సూర్య – రానా దగ్గుబాటి లాంటి స్టార్ హీరోలకి కూడా ఈ కథన వివరించారట . అందరూ కూడా ఇలాంటి కాన్సెప్ట్ జనాలు లైక్ చేయరు అన్న అపోహలోనే రిజెక్ట్ చేశారట . ఫైనల్లీ ప్రభాస్ ఆ ఛాన్స్ పట్టేశాడు ..నాగ్ అశ్వీన్ చెప్పి చెప్పగానే ఓకే చేసి సినిమాకు సైన్ చేసేసాడు.. మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా రిలీజ్ కాబోతుంది బాక్సాఫీస్ రికార్డును బద్ధలు కొట్టబోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news