Moviesబిగ్ బ్రేకింగ్: బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో ఊహించని ట్వీస్ట్.. నటి...

బిగ్ బ్రేకింగ్: బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో ఊహించని ట్వీస్ట్.. నటి హేమ రక్త నమూనాలో డ్రగ్స్ ఆనవాలు..అడ్డంగా బుక్కైందిగా..!

బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. చాలా రేవ్ పార్టీలో జరుగుతూ ఉంటాయి. పోలీసులు వాటిపై యాక్షన్ తీసుకుంటూ ఉంటారు . కానీ ఈసారి బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ మాత్రం చాలా చాలా కీలకంగా మారింది . దానికి కారణం ఇండస్ట్రీకి సంబంధించిన ఆల్మోస్ట్ 100 మంది టాప్ సెలబ్రిటీస్ ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు పోలీసుల విచారణలో బయటపడడమే . టాలీవుడ్ కన్నడ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు కూడా ఈ రేవ్ పార్టీలో తాగి తందనాలు ఆడారు అంటూ కన్నడ పోలీసులు తమ విచారణలో కనిపెట్టేశారు .

మొత్తంగా ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . అయితే టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు కూడా ఇదే పార్టీలో పాల్గొన్నారు అంటూ కన్నడ పోలీసులు తెల్చేశారు. వాళ్ల పేర్లు కూడా బయటపెట్టారు. కాగా మరీ ముఖ్యంగా ఈ రేవ్ పార్టీ విషయంలో నటి హేమకి సంబంధించిన వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. హేమ రేవ్ పార్టీకి వెళ్ళలేదు అంటూ ఒక వీడియో రిలీజ్ చేసింది . అయితే హేమ రేవ్ పార్టీలోనే ఉంది అంటూ కన్నడ పోలీసులు సెన్సేషనల్ వీడియో ని రిలీజ్ చేశారు.

రీసెంట్ గా ఆమె రక్త నమూనాలో డ్రగ్స్ ఆనవాలు గుర్తించినట్లు పోలీసులు చెప్తున్నారు . మొత్తం 150 మంది రక్త నమూనాలను నార్కోటిక్ టీం సేకరించినట్లు సమాచారం అందుతుంది. అందులో మొత్తంగా 57 మంది పురుషులు 27 మంది మహిళల రక్త నమూనాలో డ్రగ్స్ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు . ఈ లిస్టులో నటి హేమా కూడా ఉండడం గమనార్హం . అయితే నటి హేమా మాత్రం తాను డ్రగ్స్ తీసుకోలేదని త్వరలోనే ఆ విషయాలు బయటపెడతానని చాలా ధీమాగా చెప్పుకొస్తుంది. అయితే ఈ పార్టీలో నటి హేమ డ్రగ్స్ తీసుకుందా..? తీసుకోలేదా ..? అన్న విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. మరికొందరు మాత్రం నటి హేమ మాటలు నమ్మడం లేదు . మొదట పార్టీకి వెళ్ళలేదు అన్నింది.. ఇప్పుడు డ్రగ్స్ తీసుకోలేదు అంటుంది .. అన్ని సమయానుసారం మాట మార్చేస్తుంది అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news